బావా కంగ్రాట్స్… నీకు పక్కా లక్ష మెజారిటీ ..

హైదరాబాద్ నుండి సిరిసిల్ల వెళుతున్నారు కేటీఆర్. అటు నుంచి హరీష్ రావు సిద్దిపేట నియోజకవర్గంలోని పోలింగ్ సరళిని తెలుసుకుంటూ గ్రామాలు తిరిగి వస్తున్నారు. అనుకోకుండా ఒకరికొకరు ఎదురయ్యారు బావా బావమరుదులు ఇద్దరూ. గుర్రాల గొంది గ్రామం వద్ద ఎదురెదురుగా వస్తున్న కేటీఆర్, హరీష్ రావు కలుసుకున్నారు.

కారు దిగి ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఆత్మీయంగా కౌగలించుకున్నారు. ఈ సందర్భంలో బావా కంగ్రాట్స్… లక్ష మెజార్టీ ఖాయం…అని కేటీఆర్ హరీష్ రావుతో అంటూ.. నీ దాంట్లో సగం అన్నా తెచ్చుకుంట… సిరిసిల్ల పోతున్న అని ప్రేమగా మాట్లాడుకున్నారు… రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన పోలింగ్ జరుగుతుంది అని వారు ఆనందం వ్యక్తం చేశారు.