టీఆర్‌ఎస్‌ 35 సీట్లకు పరిమితం ..ప్రజాకూటమికి…

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై లగడపాటి రాజగోపాల్‌ ఎగ్జిట్‌పోల్ సర్వే ఫలితాలు ప్రకటించారు. జాతీయ సంస్థలన్నీ TRSకు పట్టం కట్టగా.. లగడపాటి మాత్రం ప్రజా కూటమి గెలుస్తుందని చెప్పారు. ఓటర్లను చాలా అంశాలు ప్రభావితం చేశాయన్న లగడపాటి.. కాంగ్రెస్‌, టీడీపీ, సీపీఐ, తెలంగాణ జన సమితికి కలిపి 65 స్థానాలు రావొచ్చని అంచనా వేశారు. 10 సీట్లు ప్లస్ ఆర్ మైనస్‌ ఉంటుందని తెలిపారు. టీఆర్‌ఎస్‌ 35 సీట్లకు పరిమితం అవుతుందని లగడపాటి తెలిపారు. ఇక్కడ కూడా 10 సీట్లు ప్లస్ ఆర్ మైనస్‌ ఉండొచ్చన్నారు.

లగడపాటి రాజగోపాల్ సర్వే ప్రకారం.. తెలంగాణ ప్రజా కూటమి అధికారంలోకి రాబోతోంది. కూటమి పార్టీలకు 65, టీఆర్ఎస్‌కు 35 సీట్లు రావొచ్చని ప్లస్ ఆర్ మైనస్‌ 10 ఉంటుందని అంచనా వేశారు. టీడీపీని విడిగా చూస్తే.. మలక్‌పేటలో మజ్లిస్‌ చేతిలో ఓటమి తప్పదన్నారు. మరో రెండు స్థానాలు ఇబ్రహీంపట్నం, మక్తల్‌లో స్వతంత్రులు గెలుస్తారన్నారు. 10 నియోజకవర్గాల్లో మాత్రమే TDP వర్సెస్‌ TRS అన్నట్టు సాగిందని.. అందులో 7 నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్లు విజయబావుటా ఎగురవేస్తారని తెలిపారు. ఇక్కడ రెండు సీట్లు అటుఇటు అవ్వొచ్చన్నారు.

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల యుద్ధం ముగిసింది. ఎగ్జిట్‌పోల్స్ ఫలితాలు వెలువడ్డాయి. జాతీయ ఛానళ్లు, సంస్థలు టీఆర్‌ఎస్‌కు పట్టం కట్టాయి. లగడపాటి రాజగోపాల్‌ మాత్రం ప్రజాకూటమి గెలుస్తుందని గంట బజాయించి చెప్తున్నారు. ప్రజా కూటమికి 65, టీఆర్ఎస్‌కు 35 సీట్లు రావొచ్చని ప్లస్ ఆర్ మైనస్‌ 10 ఉంటుందని ఫ్లాష్‌ టీమ్‌ అంచనా. బీజేపీ, మజ్లిస్, స్వతంత్రులు 7 ప్లస్ ఆర్ మైనస్‌ 2 సీట్లలో గెలుస్తారని లగడపాటి రాజగోపాల్ తెలిపారు.