ఓటు హక్కును వినియోగించుకున్న బీజేపీ సీఎం అభ్యర్థి

రాజస్థాన్‌లో అసెంబ్లీ ఎన్నికలు ముమ్మరంగా సాగుతున్నాయి. పోలింగ్ పర్వంలో పలువురు ప్రముఖులు ఓటేశారు. బీజేపీ సీఎం అభ్యర్థి వసుంధరారాజేతోపాటు బీజేపీ సీనియర్ నేతలు ఓటేశారు. తమకు సేవ చేసే నేతలకే ఓటర్లు పట్టం కడతారని అన్నారు వసుంధర రాజే..

రాజస్థాన్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు ఓటుహక్కు వినియోగించుకున్నారు. మాజీ సీఎం అశోక్‌ గెహ్లాట్‌, రాజస్థాన్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ సచిన్‌ పైలట్‌ ఓటు వేశారు. తమ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని ధీమా వ్యక్తం చేశారు.