సుబ్రహ్మణ్యపురం రివ్యూ

విడుదల తేదీ : డిసెంబర్ 07, 2018

నటీనటులు : సుమంత్, ఈషా రెబ్బా, సాయి కుమార్, సురేష్, అమిత్ శర్మ, భద్రమ్ తదితరులు

దర్శకత్వం : సంతోష్ జాగర్లపూడి

నిర్మాత : భీరం సుధాకర్ రెడ్డి

సంగీతం : శేఖర్ చంద్ర

సినిమాటోగ్రఫర్ : ఆర్ కె ప్రతాప్

ఎడిటర్ : కార్తికేయ శ్రీనివాస్

స్క్రీన్ ప్లే : సంతోష్ జాగర్లపూడి

సుమంత్,ఈషారెబ్బ జంటగా నూతన దర్శకుడుసంతోష్ రూపొందించిన చిత్రం సుబ్రహ్మణ్యపురం. సుధాకర్ ఇంపెక్స్ పతాకంపై బీరం సుధాకర రెడ్డి నిర్మించిన ఈ చిత్ర రిలీజ్ కు ముందే టీజర్, ట్రైలర్ లతో ప్రేక్షకుల అటెన్షన్ రాబట్టుకుంది. మరి ఈ సస్పెన్స్ థ్రిల్లర్ అందించిన ఎక్స్ పీరియన్స్ ఎలా ఉందో చూద్దాం.

కథ :
కార్తిక్ ( సుమంత్) దేవుడు అంటే నమ్మకం ఉండదు, కానీ పురాతన దేవాలయాల మీద పరిశోధనలు చేస్తుంటాడు. అలా అతని పరిశోధన సుబ్రహ్మణ్యపురం వరకూ వెళుతుంది. తను ప్రేమించిన ప్రియ(ఈషా రెబ్బ) ది కూడా అదే ఊరు కావడంతో సుబ్రహ్మణ్యపురం లో తన ప్రేమ, పరిశోధనలు సాగుతుంటాయి.
ఆ ఊరిలో జరుగుతున్న వరుస ఆత్మాహత్యలు కార్తిక్ ని మరింత ఆలోచనలో పడవేస్తాయి. ఆ ఊరిలో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాం కార్తీక్ మరింత ఆకర్షిస్తుంది. కానీ ఆ ఆత్మాహత్యలలో తన స్నేహితురాలు కూడా ఉండటంతో కార్తీక్ ఆ ఊరు రహస్యం ఛేదించే వరకూ అక్కడనుండి కదలనని పట్టు బడతాడు. మరి కార్తిక్ ఆ రహాస్యాన్నిఛేదిస్తాడా..? అనుగ్రహించే దేవుడు ఆగ్రహిస్తాడా..? అనేది మిగిలిన కథ..?

కథనం:

సుబ్రహ్మణ్యపురంలో జరిగే వింతలు, ఆ వింతల వెనకాల ఉండే రహాస్యాలు ను చేధించేందుకు ఆ ఊరి లోకి వచ్చిన ఒక నాస్తికుడు. రెండు విరుద్దమైన నమ్మకాల మద్య కథను నడిపేందుకు దర్శకుడు ఎంచుకుున్నకథనం చాలా ఆకట్టుకుంది. దేవుడు అనేది నమ్మకం అయితే నిరూపించబడినదే నమ్ముతాననే నాస్తికత్వం వేసే ప్రశ్నలు చాలా వరకూ హేతు బద్దంగా సాగాయి. సుమంత్ కార్తిక్ పాత్రకు పూర్తి న్యాయం చేసాడు. సుమంత్ సెటిల్డ్ చేసిన ఫెర్పార్మెన్స్ కార్తిక్ పాత్రకు ప్రాణం పోసింది. ఈషా ని అల్లరి పెట్టే సన్నివేశాలు కూడా ఆకట్టుకున్నాయి. ప్రెండ్స్ తో మద్య జరిగే సన్నివేశాలు ఆహ్లాదకరంగా ఉన్నాయి. సినిమా ప్రెండ్స్ లా కాకుండా నాచురల్ గా అనిపించే ప్రెండ్స్ గ్యాంగ్ సినిమా లో టైం పాస్ కి మాత్రమే కాకుండా కథను ముందుకు తీసుకెళ్ళేందుకు ఉపయోగపడింది. ప్రతిదీ హేతుబద్దం గా నమ్మే యువకుడు ఒక ఊరి సమస్యను పరిష్కరించడానికి పూనుకుంటే అతను చూపించిన పరిష్కారం ఏంటనే కథనం చాలా ఆసక్తిగా మలిచాడు దర్శకుడు. వరస బెట్టి ఆత్మా హత్యలు జరుగుతుంటాయి. చనిపోయే వారు కూడా బాధతో కాకుండా చాలా ఆనందంగా చనిపోతుంటారు. ఆ చావులు వెనుక రహాస్యం తెలుసుకోవాలనే ఆసక్తి ని అక్కడ లాక్ చేసాడు దర్శకుడు. గంధార లిపి లో రాసే రాతలు అర్దం చెప్పడానికి వచ్చిన వ్యక్తి చనిపోయే సన్నివేశం చాలా థ్రిల్లింగ్ గా మలిచాడు దర్శకుడు. ఈషా ఈ సినిమాలో కీలక పాత్రను పోషించింది. కథను మలుపు తిప్పే సన్నివేశాలను తన పాత్ర చుట్టే సాగాయి. శేఖర్ చంద్ర బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదనపు ఆకర్షణగా నిలిచింది. సినిమాలో దేవబలం గొప్పదా..? మానవ మేథస్సు గొప్పదా అనే ప్రశ్న కంటే మంచి పనిచేయడానికి మనస్పూర్తిగా పూనుకుంటే దానికి ప్రకృతి సహాకరిస్తుంది అనే విషయం అంతర్లీనంగా చెప్పాడు దర్శకుడు. సుబ్రహ్మణ్యపురం సెకండాఫ్ మరింత గ్రిప్పింగ్ మలిచాడు దర్శకుడు సినిమా లో ప్రతి పాత్రను అనుమానించేవిధంగా కథనం నడిపాడు. సినిమా లో విలన్ ఎవరు అనే విషయం పై ఏ మాత్రం గెస్ కి ఆస్కారం ఇవ్వలేదు దర్శకుడు. బాల సుబ్రహ్మణం పాడిన సాహో షన్ముఖ సాంగ్ సినిమాకు హైలెట్ గా మారింది. పైనాన్షియర్ గా సక్సెస్ అయిన బీరం సుధాకర రెడ్డి నిర్మాత గా కూడా తన అభిరుచి ని చాటుకున్నారు. కంటెంట్ బేసెడ్ సినిమాను నిర్మంచి తన సత్తా చాటుకున్నారు. మళ్ళీరావా తో సక్సెస్ ట్రాక్ ఎక్కిన సుమత్ కి సుబ్రహ్మణ్యపురం అదే ట్రాక్ పైనిలబెడుతుంది. కథ, కథనాలకు తగట్టుగా తనను తాను మలుచుకోవడంలో సుమంత్ చూపించిన ప్రతిభ ఆకట్టుకుంటుంది. థ్రిల్లింగ్ కథలలో సుబ్రహ్మణ్యపురం ప్రత్యక స్థానంలో నిలబడుతుంది. మానవ మేథస్సు గొప్పదా..? దైవ బలం గొప్పదా అనే ప్రశ్న మాత్రం అలాగే మిగిలింది.

చివరిగా:
గ్రిప్పింగ్ సాగే కథనం సుబ్రహ్మణ పురం కు హైలెట్ గా నిలిచింది. థ్రిల్లింగ్ కథలను ఇష్టపడే వారిని తప్పకుండా ఆకట్టుకుంటుంది.