తెలంగాణ పోలింగ్.. ఓటింగ్‌ను బహిష్కరిస్తామని గ్రామస్తుల హెచ్చరిక

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం గుమ్మ లక్ష్మీపురంలో ఓటింగ్‌ను బహిష్కరిస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. తమకు ఏజెన్సీ సర్టిఫికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 40 ఏళ్లుగా గ్రామంలో ఉంటున్నా.. తమను గిరజనులుగా ఎందుకు గుర్తించడంలేదని వాళ్లు ప్రశ్నించారు. వారితో అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు.