తెలంగాణలో గెలుపెవరిదో చెప్పిన అన్ని సర్వేలు..

telangana surves

తెలంగాణలో కేసీఆర్‌కు ఎదురులేదని టైమ్స్‌-నౌ చెప్పింది. వాళ్ల అంచనా ప్రకారం… టీఆర్ఎస్‌ 66 స్థానాలు గెలుచుకుంటుంది. అధికారంపై కోటి ఆశలు పెట్టుకున్న కూటమి 37, బీజేపీ 7, ఇతరులకు 9 స్థానాలు వస్తాయని చెప్పంది.

ఇండియాటుడే సర్వే గులాబీ దళానికి భారీ మెజార్టీ ఇచ్చింది. TRSకి 79 నుంచి 91 సీట్లు వస్తాయని, కాంగ్రెస్ కూటమి 21 నుంచి 33 స్థానాలకే పరిమితం అవుతుందని అంచనా వేసింది. బీజేపీ మూడు సీట్ల వరకు రావచ్చని.. ఇతరులకు 4 నుంచి 7 సీట్లు వస్తాయని తెలిపింది.

న్యూస్‌-ఎక్స్ ఛానల్ సర్వే కాస్త భిన్నంగా వచ్చింది. మేజిక్ ఫిగర్ 60 కాగా.. టీఆర్‌ఎస్‌ 57 దగ్గర ఆగుతుందని, కాంగ్రెస్‌కు 46, బీజేపీకి 6, ఇతరులకు 10 స్థానాలు వస్తాయని అంచనా వేసింది.

ఆరా సర్వే ప్రకారం.. టీఆర్‌ఎస్‌ 75 నుంచి 85 స్థానాల్లో గెలుస్తుంది. కాంగ్రెస్‌కు పాతిక నుంచి 35 సీట్లు వస్తాయి. బీజేపీ రెండు, మూడు… MIM 7, 8 స్థానాలు దక్కించుకుంటుంది. ఇతరులు మూడు సీట్లలో గెలుస్తారని ఆరా అంచనా.

సి-ఓటర్ ఎగ్జిట్‌ పోల్‌ మాత్రం టీఆర్ఎస్-కాంగ్రెస్‌ లను సమఉజ్జీలుగా నిలిపింది. టీఆర్‌ఎస్‌కు 48 నుంచి 60 సీట్లు కట్టబెట్టగా.. కూటమికి 47 నుంచి 59 స్థానాలు రావొచ్చని తెలిపింది. బీజేపీ 5, ఇతరులు 13 సీట్ల వరకు గెలిచే అవకాశం ఉందని తేల్చింది.

ఏక్సిస్‌ సర్వే కేసీఆర్‌కు తిరుగులేదని చెప్పింది. TRSకు 85 సీట్లు, కాంగ్రెస్‌కు 27 స్థానాలు, బీజేపీకి రెండు, ఇతరులకు ఐదు కట్టబెట్టింది.

CNN సర్వేను పరిశీలిస్తే.. టీఆర్‌ఎస్‌ 50 నుంచి 65, కూటమి 38 నుంచి 52, బీజేపీకి 4 నుంచి 7, ఇతరులకు 8 నుంచి 14 సీట్లు వస్తాయని అంచనా వేసింది.

రిపబ్లిక్ జన్‌ కీ బాత్‌.. టీఆర్‌ఎస్‌కు 50 నుంచి 65 సీట్లు వస్తాయని చెప్పారు. ప్రజా కూటమి 38 నుంచి 52 స్థానాలు గెలిచే అవకాశం ఉందన్నారు. కమలానికి, మజ్లిస్‌కు, ఇతరులకు సీట్లేమీ ఇవ్వకపోవడం విశేషం. నెంబర్లలో తేడా ఉన్నా.. జాతీయ స్థాయి ఎగ్జిట్‌పోల్‌ సర్వేలన్నీ దాదాపు టీఆర్‌ఎస్‌కే పట్టం కట్టాయి. వాటిలో ఎవరి అంచనా నిజం అవుతుందో ఈనెల 11న తేలనుంది.