ఓటేసిన సినీ ప్రముఖులు వీరే..

tollywood-heros-cast-their-vote

తెలంగాణలో ఓటింగ్ సరళి ప్రశాంతంగా సాగుతోంది. ప్రజలు పెద్దఎత్తున తమ ఓటు హక్కు వినియోగించేకునేందుకు బారులు తీరారు. ఉదయం 6:45 గంటలకే ఓట్లర్లు క్యూ లైన్లలో నిలబడ్డారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలు సైతం పెద్దఎత్తున తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. టాలీవుడ్ సినీ ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవి కుటుంబ సమేతంగా ఓటేశారు. జూబ్లీహిల్స్‌లో బూత్ నెంబర్ 148లో క్యూలైన్‌లో నిలబడి ఓటేశారు. కృష్ణా విజయనిర్మల దంపతులు, నటుడు నరేష్, తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మోహన్ బాబు, మంచులక్ష్మీ ఓటేశారు. అదేవిధంగా అల్లు అర్జున్ దంపతులు జూబ్లీహిల్స్ బూత్ నెంబర్ 152లో ఓటేశారు. అక్కినేని నాగార్జున సతీమణి అమలతో కలిసి ఓటేశారు. హీరో శ్రీకాంత్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, నమ్రత, కార్తికేయ, విజయ్ దేవరకొండ, నాగబాబు కుటుంబం, నితిన్, నికితారెడ్డి, సుధాకరరెడ్డి, నవదీప్,రాజమౌళి, సంపూర్ణేష్ బాబు, తదితరులు సినీ నటులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.