తెలంగాణ పోలింగ్‌ వేళ.. కాంగ్రెస్‌ అభ్యర్ధిపై హత్యాయత్నం

telangana Congress

తెలంగాణ ఎన్నికల పోలింగ్‌ వేళ.. తాండూరు కాంగ్రెస్‌ అభ్యర్ధి పైలెట్‌ రోహిత్‌రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. అర్ధరాత్రి సమయంలో ఆయనపై తల్వార్లతో దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. అయితే చుట్టు కాంపౌండ్‌ వాల్‌ ఉండటంతో తృటిలో తప్పించుకున్నట్లు సమాచారాం. దాదాపు వంద మంది ఆయనపైదాడికి రాగా.. అందులో పది మంది తల్వార్లతో చంపేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న నిమిషాల్లోనే పోలీసులు, కాంగ్రెస్‌ నేతలు అక్కడికి చేరుకోవడంతో దుండగులు పరారయ్యారు. అయితే తనపై దాడి చేసింది టీఆర్‌ఎస్‌ కార్యకర్తలేనంటున్న పైలెట్‌ రోహిత్‌రెడ్డి. ఈ మేరకు పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసుల్ని కోరారు.