ఓటు హక్కు వినియోగించుకున్న టీవీ5 ఛైర్మన్ బీఆర్ నాయుడు

తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 48.09 శాతం పోలింగ్‌ నమోదైంది. హైదరాబాద్‌లో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. టీవీ5 ఛైర్మన్ బీఆర్ నాయుడు, ఎండీ రవీంద్రనాథ్, వైస్ ఛైర్మన్ సురేంద్రనాథ్‌లు కూడా తమ ఓటు వినియోగించుకున్నారు.