కారు గుర్తుకు ఓటెయ్యాలని పోలింగ్‌ బూత్‌లో మహిళ ప్రచారం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. CPS పోలింగ్‌ బూత్‌లో BLOగా పనిచేస్తున్న మహిళ… కారు గుర్తుకు ఓటెయ్యాలని చెప్తోందని కొందరు ఓటర్లు ఆరోపించారు. ఈ విషయం బయటకు పొక్కడంతో ప్రజా కూటమి నాయకులు, కార్యకర్తలు ఒక్కసారిగా గుమికూడారు. సదరు మహిళను బూత్ నుంచి బయటకు పంపించేయాలని డిమాండ్ చేశారు. వారిపై పోలీసులు లాఠీలు ప్రయోగించడంతో వివాదం గాలివానలా మారింది.

పోలీసులు, అధికారులు ఓ పార్టీకి తొత్తులుగా మారిపోయారని ప్రజాకూటమి కేడర్ ఆరోపించింది. పోలీసులు దురుసుగా ప్రవర్తించడం, బూతులు తిట్టడంపై నిలదీశారు. మమ్మల్ని తిట్టే హక్కు మీకు ఎవరిచ్చారంటూ నిలదీశారు. దీంతో.. మరికొందరు పోలీసులు రంగంలోకి దిగడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.