తెలంగాణ పోలింగ్.. మహిళల కోసం ప్రత్యేకంగా పోలింగ్ స్టేషన్

ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో మహిళల కోసం ప్రత్యేకంగా ఒకే ఒక సఖి పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు. పోలింగ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ అసిస్టెంట్ పిఓ, ఇతర సిబ్బంది తో సహా పోలీస్ సిబ్బంది కూడా మహిళలే కావడం గమనార్హం. ఈ పోలింగ్ బూత్‌లో ఎక్కువగా స్త్రీలు ఉండటంతో సఖి పేరుతో మహిళ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు.