హాకీ ప్రపంచకప్‌: 5-1తో క్వార్టర్స్‌‌ చేరిన భారత్‌

హాకీ ప్రపంచకప్‌లో భారత జట్టు అదరగొట్టింది. సొంతగడ్డపై జరుగుతున్న ప్రపంచకప్‌లో బెల్జియంపై 5-1తో తిరుగులేని విజయం సాధించింది. దాంతో క్వార్టర్‌ ఫైనల్‌ కు చేరుకుంది. కచ్చితంగా గెలవాల్సిన ఆటలో టీమిండియా ఆటగాళ్లు ఏకంగా ఐదు గోల్స్‌ చేసి విజయం సాధించారు. దీంతో టీమిండియా తన ఫూల్‌లో అగ్రస్థానంలో నిలిచి క్రాస్‌ఓవర్‌ మ్యాచ్‌ను తప్పించుకుంది.