ప్రముఖ నిర్మాతను అరెస్టు చేసిన పోలీసులు

సిని నిర్మాత ప్రేరణ అరోరాను ముంబై పోలీసులు అరెస్టు చేశారు.క్రిఆర్జ్‌ ఎంటరేన్‌మెంట్‌‌ పేరుతో సినిమాలు నిర్మిస్తున్న ప్రేరణ పలు చిత్రాల హక్కులు ఇప్పిస్తానంటూ తన వద్ద 32 కోట్ల రూపాయలు తీసుకున్నారని ఫిల్మ్‌ మేకర్‌ వషు భగ్నానీ పోలీసులకు పిర్యాదు చేశాడు. దీంతో ఆమెను అరెస్టు చేసిన పోలీసులు కోర్టు అనుమతితో కస్టడికి తీసుకున్నారు. ఈఓడబ్ల్యూ(ఎకనమిక్‌ అఫెన్సెస్‌ వింగ్‌) టీమ్ ఆమెను విచారిస్తుంది. తనకు దక్కల్సిన ఫనేకాన్‌‌, బట్టి గుల్‌ చాలు మీటర్‌ వంటి చిత్రాల హక్కులు తనకు దక్కకుండా చేశారని, సినిమాలకు సంబంధించిన హక్కులు వేరే వ్యక్తులకు బదలాయించి తనను మోసం చేశారని భగ్నానీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌- సారా అలీఖాన్‌ జంటగా తెరకెక్కిన కేదార్‌నాథ్‌ వంటి సినిమాల హక్కుల విషయంలో కూడా ఆమెపై పలు చీటింగ్‌ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఆమె ముంబై ఈఓడబ్ల్యూ పోలీసుల అదుపులో ఉంది.