వధువు కోసం ప్రభాస్.. వరుడు కోసం అనుష్క.. మరి వీరి డేటింగ్..?

టాలీవుడ్‌లో మోస్ట్ బ్యాచ్‌లర్ ఎవరంటే.. టక్కున గుర్తుకొచ్చే పేరు ‘డార్లింగ్’ ప్రభాస్. బాహుబలితో వరల్డ్‌ వైడ్‌గా పాపులారిటీ సంపాదించుకున్నాడు ప్రభాస్. డార్లింగ్ అంటూ అందరినీ సరదాగ పిలిచే ఈ యంగ్ రెబల్ స్టార్ పెళ్ళికి సంబంధించి రోజుకో వార్త నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది. ఇక ప్రభాస్, అనుష్కల మధ్య వచ్చే ప్రేమ వార్తల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అటు ప్రభాస్ వధువు కోసం.. ఇటు అనుష్క వరుడి కోసం అన్వేషణలో ఉన్నారంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. వీళ్లు డేటింగ్ లో ఉన్నట్లు కూడ ఎప్పడినుంచో వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే.

మేము బెస్ట్ ఫ్రెండ్స్ తప్ప.. మీరు అనుకుంటున్నట్లు మా మధ్య ఏమీలేదని.. ప్రభాస్‌, అనుష్క ఎప్పటికప్పుడు క్లారిటీ ఇస్తూ వచ్చినప్పటికీ వదంతులకు మాత్రం ఆగటం లేదు. ఈ నేపధ్యంలో బాలీవుడ్‌ దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్‌ కరణ్’ కార్యక్రమంలో దర్శకధీరుడు రాజమౌళి, ప్రభాస్‌, రానా దగ్గుబాటి పాల్గోన్నారు. ఈ సందర్భంగా కరణ్‌.. ప్రభాస్‌ను అనుష్క గురించి అడిగారు. “నువ్వు ‘దేవసేనతో’ డేటింగ్‌లో ఉన్నావని వస్తున్న వార్తలు నిజమా! కాదా!” అని అడిగారు. ఇందుకు ప్రభాస్‌ లేదని సమాధానం చెప్పారు. ‘కానీ వార్తలు వినిపిస్తున్నాయి కదా..’ అని కరణ్‌ అడగ్గా.. ఈ వార్తలు స్టార్ట్ చేసింది మీరే కదా అంటూ సెటైర్ వేశాడు ప్రభాస్. అంతే కరణ్‌తో పాటు పక్కనే ఉన్న రాజమౌళి, రానా పగలబడి నవ్వుకున్నారు. వెంటనే కరణ్‌ ప్రభాస్‌ను మరో ప్రశ్నగా.. ‘నాకు అబద్ధాలు చెప్పావు కదూ..’ అని అడగారు. దీంతో ‘yes’ అని చెబుతూ ప్రభాస్‌ అక్కడున్న గ్లాస్‌లోని డ్రింక్‌ తాగడం చాల ఫన్నీగా అనిపించింది.

Also Read : షూటింగులో ప్రమాదం.. విజయ్ దేవరకొండకు గాయాలు

బిల్లా, మిర్చి, బాహుబలి, బాహుబలి-2 వంటి సూపర్ హిట్ చిత్రాల్లో ప్రభాస్‌కు జోడిగా అనుష్క నటించిన విషయం తెలిసిందే. అయితే బాహుబలి-1, బాహుబలి-2 హిందీ వెర్షన్‌కు ధర్మ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై కరణ్‌ నిర్మాతగా వ్యవహరించారు.