తెలుగు రాష్ట్రాల్లో కిటకిటలాడిన దేవాలయాలు

mukkoti ekadasi speacil

ముక్కోటి ఏకాదశి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో దేవాలయాలన్నీ కిటకిటలాడాయి. ఉదయం నుంచే వేలాది మంది భక్తులు విశేష పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారిని ఈ ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, వివిధ రాష్ట్రాల మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు శ్రీవారిసేవలో పాల్గొన్నారు. మాజీ ప్రధాని దేవెగౌడ కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. తెలంగాణ ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన హరీష్‌ రావు కుటుంబ సమేతంగా వేకువ జామున ప్రారంభమైన స్వామివారి విశేష దర్శనంలో పాల్గొన్నారు.

Also read : అందుకే కొంతమందికి మెజార్టీలు తగ్గాయి : కేటీఆర్

ముక్కోటి ఏకదశి సందర్భంగా రావిర్యాలలోని శ్రీ సూర్యగిరి రేణుకా ఎల్లమ్మ ఆలయంతో పాటు ఫ్యాబ్‌ సిటీలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పురాతన ఆలయాలను అభివృద్ధి చేయడంలో ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయన్నారు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలంలోని చిలుకూరు బాలాజీ దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా 18 గంటల అఖండ శ్రీమద్బగవద్గీత పారాయణం నిర్వహించారు. చిలూకురు బాలాజీ దివ్య ఆశీస్సులతో లక్ష్య సాధన ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.

తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరంలో శ్రీదేవి, భూదేవి సమేత కేశవస్వామి ఆలయాన్ని మాజీ దేవాదాయ శాఖమంత్రి పైడికొండల మాణిక్యాలరావు దర్శించుకున్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురష్కరించుకుని కేశవస్వామిని ఉత్తరద్వార దర్శనం చేసుకున్న ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బాలాలయంలో ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. చౌటుప్పల్‌ మండలం దేవలమ్మ నాగారం గ్రామంలో పురాతన ఆది మహా విష్ణుదేవాలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రెండు రాష్ట్రాల్లోనూ ప్రధాన దేవాలయాలతో పాటు.. నగరాల్లోనూ గ్రామాల్లో ఉన్న విష్ణు దేవాలయాన్నీ భక్తులతో పోటెత్తాయి. ఉత్తర ద్వార దక్షిణ ప్రవేశానికి భక్తులంతా పోటీ పడి స్వామి వారిని దర్శించుకున్నారు.