గోవింద నామస్మరణతో మారు మోగుతున్న ఆలయం

ముక్కోటి ఏకాదశిని పురష్కరించుకొని భక్తులతో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని శ్రీలక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయం కిటకిట లాడుతుంది. ఎటువైపు చూసిన భక్తుల గోవింద నామస్మరణతో ఆలయం మారు మోగుతుంది.

తెల్లవారు జామున ఒంటి గంటకే స్వామీ ఆలయం తెరచి నిత్య పూజలు, ధనుర్మాస ఉత్సవాలలో భాగమైన తిరుప్పావై పాశురములను ఆలయ పూజారులు అనుసంధానం చేశారు. అనంతరం ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారా దర్శనం కోసం శ్రీవారిని గురుడ వాహనముపై ఆశీనులు కావించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.