ఆస్ట్రేలియాలోని మోనో బీచ్‌లో ముగ్గురు తెలంగాణ వాసులు మృతి

ఆస్ట్రేలియాలోని మోనో బీచ్‌లో ముగ్గురు తెలంగాణ వాసులు మృతి చెందారు. వారిలో ఇద్దరు నల్లగొండలోని మన్యం చెల్క ఏరియాలో నివస్తున్న గౌసుద్దీన్ అతని అల్లుడు జునేద్‌, మరోకరు బీహెచ్‌ఈఎల్‌కి చెందిన రాహత్‌గా గుర్తించారు. వీరిలో గౌసుద్దీన్, రాహత్‌ల మృతదేహాలు లభ్యం కాగా.. జునేద్‌ డెడ్ బాడీ గల్లంతైంది.

మన్యం చెల్కకు చెందిన ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన విషయం తెలుకున్న మాజీ మంత్రి కోమటిరెడ్డి వారి కుటుంబ సభ్యులను ఫోన్‌లో పరామర్శించారు . తెలంగాణ ప్రభుత్వం జోక్యం చేసుకుని చనిపోయిన వారి మృతదేహాలను విలైనంత త్వరగా ఇక్కడికి తెప్పించే ప్రయత్నం చేయాలని కోరారు.