విషాదం నింపిన విహారయాత్ర ..ఆస్ట్రేలియాలో తెలంగాణవాసుల మృతి

telangana people died-australia beach

ఆస్ట్రేలియాలో విహారయాత్ర ముగ్గురి తెలంగాణ వాసుల కుటుంబాల్లో విషాదం నింపింది. న్యూ సౌత్‌ వెల్స్‌లోని మోనోబీచ్‌కు వెళ్లిన నల్లగొండ జిల్లాకు చెందిన ఒకరు, హైదరాబాద్‌కు చెందిన మరొకరు మృతిచెందగా ఇంకొకరు గల్లంతయ్యారు. . వారిలో ఇద్దరు నల్లగొండలోని మాన్యం చెల్క ఏరియాలో నివస్తున్న గౌసుద్దీన్ అతని అల్లుడు జునేద్‌, మరోకరు బీహెచ్‌ఈఎల్‌కి చెందిన రాహత్‌గా గుర్తించారు. జునైద్‌ మృతదేహం కోసం పోలీసులు, సహాయక సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

గౌసుద్దీన్‌ అతని భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి ఆస్ట్రేలియాలోని సిడ్నీ ప్రాంతంలో మూడేళ్లుగా నివాసముంటున్నాడు. గౌసుద్దీన్‌కు వరుసకు అల్లుడైన జువేద్‌ ఆస్ట్రేలియాలోనే ఎంఫార్మసీ చదువుతూ పార్ట్‌ టైం ఉద్యోగం చేస్తున్నాడు. వీరి సమీప బంధువు బీహెచ్‌ఈఎల్‌కు చెందిన రాహేత్‌ కూడా సిడ్నీలోనే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తున్నాడు. క్రిస్‌మస్‌ సెలవులు రావడంతో గౌసుద్దీన్‌తో పాటు అతని భార్య, ముగ్గురు పిల్లలు, రాహేత్, జువేద్‌ కలిసి మోనో బీచ్‌లో విహారయాత్రకు వెళ్లాయి..

ఈ విహార యాత్రలో బోటు ప్రమాదం చోటు చేసుకుంది. ఇది గమనించిన పోలీసులు గౌసుద్దీన్‌, రాహెత్‌ల మృతదేహాలను వెలికితీశారు.జువేద్ మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నారు. . గౌసుద్దీన్‌ కుమారుడు అకీబ్‌, కుమార్తెలు ఈషా, రమ్షాలు కూడా నీటిలో మునిగిపోతుండగా సహాయక సిబ్బంది కాపాడారు. జునైద్‌, గౌసుద్దీన్‌ కుటుంబ సభ్యులను స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌ రెడ్డి, మాజీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పరామర్శించారు. జునైద్‌ మృతదేహాన్ని జిల్లాకు తీసుకొచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.