తెలుగు టైటాన్స్‌ కథ దాదాపు ముగిసినట్టేనా?

కబడ్డీ ఆరో సీజన్‌లో తెలుగు టైటాన్స్‌ కథ దాదాపు ముగిసినట్లే కనిపిస్తోంది. ప్లేఆఫ్‌ చేరాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్‌లో టైటాన్స్‌ ఓటమి పాలైంది. కీలకమైన వైల్డ్‌కార్డు మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్‌ 20-35 తేడాతో పుణెరి పల్టాన్‌ చేతిలో ఓడిపోయింది. మ్యాచ్‌లో ఏ దశలోనూ టైటాన్స్‌ గెలిచేలా కనిపించలేదు. ఆశలు పెట్టుకున్న టాప్ రైడర్లు రాహుల్ చౌదరి, నీలేశ్ ఘోరంగా విఫలమవడంతో ఆరంభం నుంచే వెనుకబడింది.

Also read : టీఆర్ఎస్‌లో చేరికపై టీడీపీ ఎమ్మెల్యే స్పందన

సెకండాఫ్‌లోనూ తేలిపోయిన టైటాన్స్‌ సరైన పోటీ కూడా ఇవ్వలేకపోయింది. ఈ ఓటమితో ఆ జట్టు టైటాన్స్ ప్లే ఆఫ్ రేసు నుంచి దాదాపు నిష్క్రమించింది. మరో మ్యాచ్‌లో విరామం తర్వాత కూడా ఆట మారలేదు. ప్రత్యర్థి జట్టులో జీబీ మోర్‌ (10), రవి కుమార్‌ (5) రాణించారు. మరో మ్యాచ్‌లో బంగాల్‌ వారియర్స్‌ 27-24 తో తమిళ్‌ తలైవాస్‌పై విజయం సాధించింది. ఈ గెలుపుతో బంగాల్‌ ప్లేఆఫ్‌కు మరింత చేరువైంది.