సేమ్ టు సేమ్ ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’ లో జరిగినట్టే జరిగింది

uk-dj-and-comedian-iain-lee-kept-suicidal-caller-talking-till-ambulance-arrived

రియల్‌ లైఫ్‌ కి రీల్ లైఫ్‌ కి ఎక్కడో ఓ చోట లంకె కుదురుతుంది. రియల్ లైఫ్‌ తో ఇన్స్‌పైర్‌ అయి రీల్‌ కెక్కే సినిమాలు కొన్ని ఉంటాయి. కానీ, యాధృచ్చికంగా సినిమాలో కనిపించే దృశ్యాలు కొన్నాళ్ల తర్వాత బయట చోటు చేసుకుంటాయి. ఇలాంటి ఘటనే బ్రిటన్‌ లో జరిగింది. శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌ సీన్‌ బ్రిటన్‌ లో యదార్థంగా జరిగింది.

Also read : పండగే పండగ.. వీటిపై జీఎస్టీ తగ్గింపు..

శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీలోని ఓ కేరక్టెర్ తండ్రి కూడబెట్టిన డబ్బులను వ్యాపారంలో పెట్టి నష్టపోతాడు. ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు. తన బాధని ఎఫ్‌ఎం హోస్ట్‌ తో షేర్‌ చేసుకుంటాడు. మాటల్లో పెట్టి హీరో ఇచ్చిన కౌన్సెలింగ్ తో నిర్ణయం మార్చుకొని తండ్రి ముందు నిజం ఒప్పుకుంటాడు. స్టోరీ కాస్త డిఫరెంట్‌ గా ఉన్నా బ్రిటన్‌ లోనూ శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీ తరహా ఘటన నిజంగానే జరిగింది.

చాన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఎక్కువ మోతాదులో మెడిసిన్‌ తీసుకున్నాడు. దాదాపు స్పృహ కోల్పోయే స్థితికి చేరుకున్నాడు. ఆ సమయంలోనే తనకు ఇష్టమైన ఓ రేడియో షోకు ఫోన్‌ చేశాడు. అయితే అతడి పరిస్థితి గుర్తించిన షో హోస్ట్ సమయస్ఫూర్తితో వ్యవహరించి ఆ వ్యక్తి ప్రాణాలు కాపాడాడు.

లేట్‌ నైట్‌ అల్టర్‌ నెట్‌ అనే పేరుతో బ్రిటన్‌ లో ఓ రేడియో షో ప్రసారం అవుతుంది. రాత్రి పది నుంచి ఒంటిగంట వరకు ప్రసారమయ్యే ఆ షోకు ఐన్‌ లీ అనే కమేడియన్‌ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. రేడియో షోకి ఫోన్‌ చేసిన క్రిస్ అనే వ్యక్తి… తాను మానసిక సమస్యలతో బాధపడుతున్నానని, అందుకే తనకు ఐన్‌ లీ షో అంటే ఇష్టమని చెప్పాడు. అయితే.. అనారోగ్యంతో తాను మోతాదు మించి మెడిసిన్‌ వేసుకున్నానని కాసేపట్లో చనిపోతానని.. ఎక్కడ ఉన్నానో కూడా తెలియదంటూ షాకింగ్ న్యూస్‌ చెప్పాడు. దీంతో అతన్ని మాటల్లో పెట్టిన ఐన్‌ లీ.. అతని వివరాలు.. చుట్టుపక్కల పరిసరాల గురించి ఆరా తీసి పోలీసులకు, వైద్య సిబ్బందికి సమాచారం అందించాడు. అరగంటలోనే అక్కడికి చేరుకున్న అధికారులు క్రిస్‌ ను రక్షించారు.

శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌ సినిమా తరహాలో ఐన్‌ లీ సమయస్ఫూర్తితో వ్యవహరించి ఓ వ్యక్తి ప్రాణాలు కాపాడాడు. దీంతో అతనిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అతడిని లీ అప్రమత్తతే కాపాడిందని అధికారులు, నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.