సొంతగడ్డపై సింధు ఆటను చూసేందుకు అభిమానుల ఆసక్తి

pv-sindhu-1st-indian-gold-medal-bwf-world-tour-finals-nozomi-okuhara
  • నగరంలో పిబీఎల్ సందడి గచ్చిబౌలీ స్టేడియంలో జరగనున్న పోటీలు
  • తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌, చెన్నై ఢీ
  • హైదరాబాద్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తోన్న సింధు
  • తొలి మ్యాచ్‌లో మారిన్‌పై గెలిచి జోష్‌మీదున్న సింధు
  • సొంతగడ్డపై సింధు ఆటను చూసేందుకు అభిమానుల ఆసక్తి

ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ హైదరాబాద్ లెగ్ ఇవాళ ప్రారంభం కాబోతోంది. నాలుగురోజుల పాటు జరగనున్న ఈ పోటీలకు గచ్చిబౌలీ స్టేడియం ఆతిథ్యమిస్తోంది. ఇప్పటికే నగరానికి చేరుకున్న అన్ని జట్ల క్రీడాకారులు ప్రాక్టీస్‌లో బిజీగా ఉన్నారు. ఇవాళ జరిగే తొలి మ్యాచ్‌లో హైదరాబాద్ హంటర్స్ , చెన్నై స్మాషర్స్ తలపడనున్నాయి. తొలిసారిగా హైదరాబాద్‌ ఫ్రాంచైజీకి ఆడుతోన్న సింధు టోర్నీ ఆరంభ పోరులో స్టార్ ప్లేయర్ కరోలినా మారిన్‌పై గెలిచి శుభారంభం చేసింది. సొంతగడ్డపై సింధు ఆటను చూసేందుకు అటు అభిమానులు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.