కేరళలో మళ్ళీ ఉద్రిక్త పరిస్థితులు

kerala-police-leaked-our-plans-didn-t-want-us-enter-sabarimala-manithi-alleges

కేరళలోని పరమపవిత్రమైన శబరిమల అయ్యప్పస్వామి దేవాలయంలోకి ప్రవేశించేందుకు మహిళలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అయ్యప్పదర్శనానికి ఆదివారం నాడు 11 మంది మహిళలు ప్రయత్నించగా, సోమవారం మరో ఇద్దరు మహిళలు అదే ప్రయత్నం చేశారు. ఆదివారం వచ్చిన 11 మంది మహిళలు, తాజాగా వచ్చిన ఇద్దరు మహిళలు కూడా 50 ఏళ్ల లోపు వారే కావడంతో అయ్యప్పభక్తులు, హిందూత్వవాదులు అడ్డుకున్నారు. దాంతో సన్నిధానం పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Also read : తెలంగాణలో పంచాయతీ పోరుకు జిల్లాల వారీగా రిజర్వేషన్లు ఖరారు

మలప్పురానికి చెందిన బిందు, కోజికోడ్ కు చెందిన కనకదుర్గ, అయ్యప్ప దర్శనానికి బయల్దేరారు. తొలుత అప్పచిమేడు వద్ద వారిని అయ్యప్ప భక్తులు అడ్డుకున్నారు. పోలీసులు వారిని నిలువరించి బిందు, దుర్గలను భారీ భద్రత మధ్య ముందుకు తీసుకెళ్లారు. ట్రెక్కింగ్ దారిలో చంద్ర‌నంద‌న్ రోడ్డు వ‌ద్ద భ‌క్తులు, నిర‌స‌న‌కారులు ఆ మ‌హిళ‌ల‌ను అడ్డుకున్నారు.అక్కడి నుంచి మారకూటం చేరుకున్న బిందు, దుర్గలను భక్తులు మరోసారి అడ్డుకున్నారు. దీంతో పోలీసులు అదనపు బలగాలను రంగంలోకి దించి, ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ప్రయోజనం లభించలేదు.

బిందు, దుర్గలను అయ్యప్పస్వాములు, ఇతర ఆందోళనకారులు ముందుకు వెళ్లనివ్వ లేదు. స‌న్నిధానం నుంచి వెనుదిరిగి వ‌స్తున్న భ‌క్తులు కూడా మ‌హిళ‌ల‌కు వ్య‌తిరేకంగా నినాదాలు చేశారు. బిందు, దుర్గ మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లో స్వామిదర్శనం కాకుండా వెనుదిరిగి వెళ్లే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. బిందు, దుర్గలను భారీ భద్రత మధ్య సన్నిధానానికి తీసుకెళ్లడానికి పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. అయ్యప్పస్వాములు, హిందూత్వ వాదుల ఆందోళనకు తలొగ్గిన పోలీసులు, బిందు, దుర్గలను వెనక్కి పంపించారు.