భారీగా పతనమైన చమురు ధరలు

Petrol
Petrol

అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు మరింతగా క్షీణించాయి. క్రూడ్‌ ఉత్పత్తి పెరుగుదల, ఆర్థికవృద్ధి మందగమన భయాలు ధరల పతనానికి కారణమైయినట్లుగా విశ్లేషకులు చెపుతున్నారు. అమెరికా మార్కెట్లో బ్యారెల్‌ బ్రెంట్‌ క్రూడాయిల్‌ ధర 6.50శాతం క్షీణించి 50.47 డాలర్ల వద్ద ముగిసింది. ఈ వారం రోజుల్లోనే క్రూడ్ ధరలు 11శాతం పైగా దిగివచ్చాయి.

ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ గణాంకాలు అనుకున్నంత స్థాయిలో కనిపించకపోవడం కూడా క్రూడ్ ధరల పతనానికి కారణమైంది. స్టాక్ మార్కెట్లలలో ఈక్విటీ షేర్ల క్షీణతతో పాటు యూరోజోన్ రుణ సంక్షోభం కోనసాగుతుండడం వంటి అంశాలు క్రూడాయిల్‌ ధరలు కిందికి దిగి రావడానికి కారణమైనట్లుగా మార్కెట్ నిపుణుల అంచనా.దీంతో రష్యా నేతృత్వంలోని ఒపెక్‌ దేశాలు జనవరి నుంచి రోజుకు 1.2 మిలియన్‌ బ్యారెళ్ల చమురు ఉత్పత్తిని తగ్గించుకోవడానికి నిర్ణయం తీసుకున్నాయి.