దారుణం: అమెరికాలో నలుగురు తెలుగు ఎన్నారైల సజీవదహనం

Telugu-NRIs
Telugu-NRIs

అమెరికాలో జరిగిన అగ్నిప్రమాదంలో తెలంగాణకు చెందిన నలుగురు ఎన్నారైలు సజీవదహనమయ్యారు. అమెరికాలోని కొలిర్‌ విలీలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది.

నల్గొండ జిల్లా దేవరకొండకు చెందిన ఒకే కుటుంబానికి చెందినవారు ముగ్గురున్నారు. ఈ ఘటనలో దేవరకొండకు చెందిన సాత్విక్‌ నాయక్‌, సుహాస్‌ నాయక్‌, జయ సుచిత్‌ మృతిచెందినట్టు బంధువులకు సమాచారం అందించారు. ఈ ఘటనతో వారి స్వగ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

విదేశాల్లో ఇటీవల చోటు చేసుకుంటున్న వరుస ప్రమాదాలు ఉమ్మడి నల్గొండ జిల్లాలో విషాదఛాయలు నింపుతున్నాయి. గత వారం కూడా అమెరికాలో జరిగిన ప్రమాదంలో జిల్లాకు చెందిన ముగ్గురు మృతి చెందారు.