ఒంట్లో వేడిని తగ్గించే ‘ధనియాలు’.. చలికాలంలో మరిన్ని ప్రయోజనాలు..

ఏ కూరలో అయినా కాస్త ధనియాల పొడి వేస్తే చాలు. ఘుమ ఘుమ లాడే సువాసనతో పాటు మంచి రుచిని అందిస్తుంది. మాంసం కూరలో వాడే మసాలాలో ధనియాలదే ప్రముఖ పాత్ర. కూరల్లో కొత్తిమీర ఎంత వాడినా మసాలా పొడిలో ధనియాలు కలిపితేనే రుచి వస్తుంది.

మరి ఇలాంటి దనియాలను కూరకు దినుసుగానే కాదు ఔషధంగానూ వాడవచ్చంటున్నారు వైద్యులు. ఇటీవల జరిపిన పరిశోధనల్లో ధనియాలను గ్యాస్ నుంచి ఉపశమనం కలిగించేవిగా, శరీరాన్ని చల్లబరిచేవిగా, మూత్రాన్ని జారీచేసేవిగా, లైంగిక శక్తిని పెంచేవిగా, రక్తంలో గ్లూకోజ్‌ని తగ్గించేవిగా, మరియు అంతర్గత అవయవాల్లో నొప్పిని తగ్గించేవిగా పనిచేస్తాయని తేలింది.

 • ధనియాలను నీటిలో మరిగించి దాన్ని వడకట్టి తాగుతుంటే షుగర్ తగ్గుతుంది.
  * టైఫాయిడ్ వచ్చినప్పుడు ధనియాల కషాయం తీసుకుంటే వెంటనే తగ్గిపోతుంది.
  * ధనియాలను మెత్తని చూర్ణంలా చేసి దానిలో కొద్దిగా పసుపు కలిపి ముఖంపైన వచ్చే మొటిమలపై రాస్తుంటే తగ్గుతాయి.
  * లైంగిక శక్తిని పెంపొందించేందుకు ధనియాలు ఉపయోగపడతాయి.
  * ధనియాల కషాయంలో చిటికెడు పసుపు కలిపి తాగితే శరీరంలోని కొవ్వు కరిగిపోతుంది.
  * ఇమ్యూనిటీని పెంచే శక్తికూడా ధనియాలకు ఉంది.
  * ఈ కషాయంలో కొంచెం పాలు, చక్కెర కలుపుకుని తాగితే మంచి నిద్ర పడుతుంది.
  * దనియాలతో చేసే కషాయం గోరు వెచ్చగా తీసుకుంటే జలు, జ్వరం తగ్గుముఖం పడతాయి.
  * సాల్మొనెల్లా అనే బ్యాక్టీరియాతో వచ్చే టైఫాయిడ్ జ్వరాన్ని ధనియాలు దూరం చేస్తాయి.