చిన్న కంపెనీల్లో LIC పెట్టుబడులు..!

దేశంలో అతిపెద్ద ఇన్సూరెన్స్ కంపెనీ అయిన LIC తన పెట్టుబడులను సరికొత్త పంథాలో పెడుతూ.. ఫండ్ మేనేజర్లను ఆశ్చర్యానికి గురి చేసింది.  వారసత్వ పెట్టుబడులను యథాతథంగా ఉంచి.. BSE 200 కంపెనీల్లో తన పెట్టుబడులను పెంచింది LIC.

స్టాక్ మార్కెట్లో దాదాపు రూ. 6 లక్షల కోట్ల పెట్టుబడులు కలిగి ఉన్న కంపెనీ తాజాగా రూ. 2000 కోట్ల విలువైన స్టాక్స్ ను కొనుగోలు చేసింది. వీటిలో స్వాన్ ఎనర్జీ, గ్రాన్యూల్స్ ఇండియా,  రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ , ఓమెక్స్ ఇండియా, ఫ్యూచర్ లైఫ్ స్టైల్, టాటా కాఫీ, గేట్‌వే డిస్ట్రిపార్క్స్ వంటి కంపెనీల స్టాక్స్ ను LIC కొనుగోలు చేసింది.

కాగా చిన్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడానికి వ్యతిరేకమైన LIC ఒక్కసారిగా ఈ చిన్న కంపెనీల స్టాక్స్‌ను కొనుగోలు చేయడం మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ” గత 3 సంవత్సరాలుగా చిన్న కంపెనీల్లో, అందునా BSE 200 కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడానికి మేం కొంచెం ఆలోచించిన మాట వాస్తవమే”నని LIC మేనేజింగ్ డైరెక్టర్ హేమంత్ భార్గవ్ పేర్కొన్నారు.

LIC అనేది ఎప్పటి నుంచో ఉన్న సంస్థ అనీ, అందులోని వారసత్వ పెట్టుబడులను కాదని కొత్తగా ఇంతవరకూ ఏమీ చేయలేక పోయామని ఆయన అంటున్నారు. దీనికి విరుధ్ధంగా రాబోయే కాలంలో మంచి లాభాలు వస్తాయనుకున్న కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడానికి LIC బోర్డు సముఖత వ్యక్తం చేసిందని హేమంత్ అంటున్నారు.

lic graph

source by: economic times

వక్రంజీ, గీతాంజలి జెమ్స్, ఆమ్‌టెక్ ఆటో , మంథాన ఇండస్ట్రీస్ , ఎలక్ట్రో స్టీల్ క్యాస్టింగ్, ఆప్టో సర్కూట్స్ వంటి కంపెనీల్లో తన పెట్టుబడులను పెంచింది. ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టక ముందే అవి క్రాష్ అవ్వడం విశేషం. కానీ LIC వీటి పనితీరుపై నమ్మకం ఉంచింది. డౌన్ వర్డ్ ట్రెండింగ్ కంపెనీల్లో LIC పెట్టుబడులు పెట్టడం పలు మ్యూచువల్ ఫండ్ మేనేజర్లను ఆశ్చర్యానికి గురి చేసింది.

కాగా LIC  ఇండియా బుల్స్‌లో 11శాతం పెట్టుబడులను పెంచింది.  దివాన్ హౌసింగ్‌లో కూడా 3.4శాతం పెట్టుబడులను పెంచింది. ఈ రెండు కంపెనీల స్టాక్స్ కూడా గత సెప్టెంబర్ మాసాంతానికి పతనం అయిన షేర్లే కావడం గమనార్హం.