ప్రొ కబడ్డీ లీగ్‌ ఆరో సీజన్‌.. ఉత్కంఠ రేపిన పట్నా గుజరాత్‌ మ్యాచ్‌

Pro Kabaddi League 2018, Gujarat Fortunegiants outclass Patna, Gujarat beat patna, Pro Kabaddi

ప్రొ కబడ్డీ లీగ్‌ ఆరో సీజన్‌ మ్యాచ్‌లు చాలా రసవత్తరంగా సాగుతున్నాయి. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో.. పట్నా పైరేట్స్‌ ఓడింది. ఉత్కంఠరేపిన మ్యాచ్‌లో పట్నా 29 –37తో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ చేతిలో ఓడింది.

మరో మూడు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా 28 – 30తో వెనుకంజలో ఉన్న పట్నా ఆ తర్వాత మరిన్ని పాయింట్లు కోల్పోయి ఓటమి పాలైంది. మరోవైపు బి గ్రూప్‌లో ఇప్పటికే ప్లేఆఫ్‌ బెర్తులు ఖరారు చేసుకున్న రెండు జట్ల మధ్య జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో బెంగాల్‌ వారియర్స్‌ 37-31తో బెంగళూరు బుల్స్‌ను ఓడించింది.

మరిన్ని వార్తలు

Also Read : భార్య కాపురానికి రావడం లేదని మామ పీక కోసి..

ఆసీస్‌తో జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్టులో భారత బ్యాట్స్‌మెన్‌ అదరగొట్టారు. రెండో రోజు మ్యాచ్‌లో పుజారా శతకంతో రాణించగా.. కోహ్లీ, రోహిత్‌ శర్మ అర్ధ శతకం చేయడంతో టీమిండియా భారీ స్కోరు చేసింది. తొలి ఇన్నింగ్స్‌ను టీమిండియా 443/7 వద్ద డిక్లేర్‌ చేసింది.
—————
ఏపీ ప్రజల శక్తి ఎంటో తెలిసేలా కడప స్టీప్‌ ప్లాంట్‌ను పూర్తి చేసి చూపిస్తానన్నారు చంద్రబాబు. రాయలసీమను పరిశ్రమల గడ్డగా తయారు చేసే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. కేంద్రం తీరుపై తిరగబడి పట్టుదలతో తామే ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు సిద్దమయ్యామని అన్నారు చంద్రబాబు. .
—————
ఢిల్లీలో సీఈసీ సునీల్‌ ఆరోరాతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. ఈ భేటీలో ఓట్ల తొలగింపు అంశాన్ని సీఈసీ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే టీఆర్‌ఎస్‌ కారు గుర్తుకు దగ్గరగా ఉన్న ఐరన్‌ బాక్స్‌, ట్రక్, రోడ్‌ రోలర్‌ గుర్తులను తొలగించాలని సీఈసీని సీఎం కేసీఆర్ కోరినట్టు తెలుస్తుంది. .
—————
ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం వైసీపీ ఢిల్లీలో వంచనపై గర్జన దీక్ష చేస్తుంది.. ప్రత్యేక హోదా, విభజన చట్టంలోని హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టింది.
—————
ఏపీ హైకోర్టు విభజనతో అమరావతిలో జ్యుడిషియల్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు వేగంగా జరుగుతోంది. జనవరి 1 నుంచి ఇక్కడ కార్యకలాపాలు మొదలయ్యే పరిస్థితి లేకపోవడంతో విజయవాడలో ఉన్న సీఎం క్యాంప్ కార్యాలయాన్ని తాత్కాలిక కార్యాలయంగా ఉపయోగించుకోవాలని నిర్ణయించారు.
—————-
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గుంటూరు పర్యటనను అడ్డుకుంటామని టీడీపీ, కాంగ్రెస్‌, వామపక్ష నేతలు అనడం సరికాదన్నారు.. బీజేపీ MLC మాధవ్‌. దేశంలోని ఏ రాష్ట్రానికి చేయనంత అభివృద్ధి సాయం ఆంధ్రప్రదేశ్‌కు మోడీ చేశారని ఆయన చెప్పారు
—————
హైకోర్టు విభజన గందరగోళానికి కారణమైంది. ఉమ్మడి కేసుల విభజన విషయంలో స్పష్టత లేకపోవడం, ఉద్యోగుల పంపకాల వ్యవహారం కూడా తేలకపోవడంతో.. దీనిపై ఎలా ముందుకు వెళ్లాలన్నది సర్వత్రా చర్చనీయాంశమైంది.
—————
ఈ నెల 29 నుంచి అమల్లోకి రాబోతున్న ట్రాయ్ కొత్త నిబంధనలకు వ్యతిరేకంగా MSOలు, కేబుల్ టీవీ ఆపరేటర్స్ ఆందోళనకు దిగారు. ఇందిరా పార్కు వద్ద మహా ధర్నా నిర్వహించారు. ట్రాయ్ చట్టం కేబుల్ టీవీ వినియోగదారులపై పెను భారం మోపుతుందని నిరసన వ్యక్తం చేశారు.
—————
కృష్ణా నదీ జలాల కేటాయింపు అంశంపై చర్చించేందుకు కృష్ణా బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం అయింది. కృష్ణా బోర్డు చేసిన కొన్ని కేటాయింపులపై తెలంగాణ అభ్యంతరాలను లేవనెత్తడంతో ఈ భేటీ నిర్వంచారు.
—————–
తమిళనాడులోని వేలూరులో చిరుత బీభత్సం సృష్టిచింది.నాగలేరు గ్రామస్తులపై దాడి చేసింది. చిరుత దాడిలో మహిళ గాయపడింది. చిరుతను తరిమికొట్టడానికి వెళ్లిన గ్రామస్తులపైనా దాడి చేసింది.
—————
ట్రిపుల్ తలాక్‌ బిల్లుపై లోక్‌సభలో వాడీవేడి చర్చ జరుగుతోంది. కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ఈ బిల్లును ప్రవేశ పెట్టి చర్చను ప్రారంభించారు. ఇది మైనారిటీ మహిళల హక్కు, వారి న్యాయానికి సంబంధించినదని రవిశంకర్ పేర్కొన్నారు.
—————–
ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుపై చర్చకు విపక్షాలు అభ్యంతరం తెలిపాయి. బిల్లును జాయింట్‌ సెలెక్ట్‌ కమిటీకి పంపాలని కోరాయి. దీంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది.
—————
శంషాబాద్ విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. కస్టమ్స్‌ అధికారులు చేపట్టిన తనిఖీలో ఓ మహిళా ప్రయాణికురాలి నుంచి 310 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్ అధికారులు మహిళను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
———————–
హిమాచల్‌ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కాంగ్రాలోని లంజ్‌ ప్రాంతంలో స్కూల్ బస్సు బోల్తా పడింది. ప్రమాదంలో 35 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి.
—————
సునామీకి కారణమైన అగ్నిపర్వతం ఉన్న సముద్రతీరానికి దూరంగా ఉండాలని ఇండోనేషియా ప్రజలను అధికారులు హెచ్చరించారు. మళ్లీ సునామీ వచ్చే అవకాశం ఉన్నట్టు భావిస్తున్న తరుణంలో.. ప్రజలు కనీసం కిలో మీటర్‌ దూరం ఉండాలని సూచించారు.
—————