జై బాలయ్య.. అబ్బాయ్‌ నోట బాబాయ్‌కు జేజేలు..

ntr, nbk, Jr NTR shout Jai Balayya, SS Rajamouli's son Karthikeya's wedding, Jai Balayya, Karthikeya wedding

అబ్బాయ్‌ నోట బాబాయ్‌ పేరు. జై బాలయ్య అంటూ నినాదాలు.. ఇంకేముంది.. పార్టీకి వచ్చిన వారంతా ఉర్రూతలూగిపోయారు. కేరింతలతో ఫంక్షన్ మారుమోగిపోయింది. దర్శక బాహుబలి రాజమౌళి.. తనయుడి పెళ్లి సంగీత్‌ ఫంక్షన్‌లో జరిగింది ఈ హంగామా.

అందరూ హుషారుగా ఉన్న సమయంలో ఓ అభిమాని జై బాలయ్య అంటూ గొంతెత్తాడు. అక్కడే ఉన్న జూనియర్‌ ఎన్టీఆర్‌ సైతం దానికి గొంతు కలిపాడు. తను కూడా జై బాలయ్య అంటూ బిగ్గరగా అరిచాడు. దీంతో మిగతా వారు కూడా అదే జోష్‌తో జై బాలయ్య అనేశారు.