స్మృతీ ఇరానీని ఆంటీ అని పిలిచి సారీ చెప్పిన యంగ్ బ్యూటీ

smriti-irani, janvi, amriti reaction

అటు వైపు కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ… ఇటు వైపు అందాల భామ జాన్వీ కపూర్… స్మృతీ ఇరానీని చూడగానే జాన్వీ కపూర్ సంతోషంతో ఆమె దగ్గరికి వెళ్లింది. స్మృతీ ఇరానీ కూడా జాన్వీతో ఆప్యాయంగా మాట్లాడారు. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ, జాన్వీ పిలుపు స్మృతీ ఇరానీకి చిరాకు తెప్పించింది. అబ్బా ఇదేం పిలుపు, ఎవరైనా నన్ను షూట్ చేయండి అంటూ స్మృతీ ఇరానీ ఆక్రోశించారు.

మనకు పరిచయం ఉన్న వ్యక్తులను ఏదో ఒక వరుసతో పిలుస్తాం. అదేవిధంగా, మనకు పరిచయం లేని వ్యక్తులను ఆంటీ లేదా అంకుల్ అని పిలవడం కామన్ ఐపోయింది. ఎదుటివాళ్లకు నచ్చుతుందా లేదా అన్నది పక్కకుపెడితే, ఈజీగా-క్యాచీగా ఉందని చాలా మంది అలా పిలుస్తుంటారు. ఎక్కువ మంది పెద్దగా పట్టించుకోరు గానీ, కొంతమందికి మాత్రం అలా పిలవడం పెద్దగా నచ్చదు. కేంద్రమంత్రి స్మృతీ ఇరానికి కూడా ఆంటీ అన్న పిలుపు నచ్చలేదు.

https://www.instagram.com/p/Br390f1Agma/

ఎయిర్‌ పోర్టులో స్మృతి ఇరానీ, జాన్వీ కపూర్ కలుసుకున్నారు. ఇద్దరూ పరస్పరం పలకరించుకున్నారు. సరదదాగా మాట్లాడుకున్నారు. అయితే, ఆంటీ.. ఆంటీ… అంటూ జాన్వీ పదే పదే పిలవడం స్మృతి ఇరానీకి ఇబ్బంది కలిగించింది. ఈ విషయాన్ని స్వయంగా స్మృతీ ఇరానీ వెల్లడించారు. ఈ మేరకు పోస్ట్ పెట్టిన ఆమె, తనను ఆంటీ అని పిలుస్తుంటే ఎవరైనా నన్ను షూట్ చేయండి అని అరవాలనిపించిందని చెప్పుకొచ్చారు. చివరకు స్మృతీ ఇరానీ ఇబ్బందిని గుర్తించిన జాన్వీ, చివరకు తప్పును గ్రహించి సారీ చెప్పిందట.