రాజమౌళి కుమారుడి పెళ్లి వేడుక.. స్టెప్పులతో అదరగొడుతున్న టాలీవుడ్ తారలు

దర్శక ధీరుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ, జగపతిబాబు సోదరుడు రాంప్రసాద్ కుమార్తే పూజల పెళ్లి సంగీత్‌‌ శనివారం రాత్రి ఘనంగా జరిగింది. ఈ సంగీత్‌లో టాలీవుడ్ తారలు వేదికపై స్టెప్పులేశారు. తారక్, చెర్రీ, రానా, డార్లింగ్ ప్రభాస్ కలిసి అజిత్ పాటకు డ్యాన్స్ చేశారు. ఈ సాంగ్‌కు వీళ్లతో కలిసి రాజమౌళి కూడా చిందేశారుh

తరువాత రాజమౌళి తన భార్య రమతో కలిసి ‘ఎట్టాగో ఉన్నాది ఓ లమ్మీ.. ఏటేటో అవుతోంది చిన్మమ్మి..’ సాంగ్‌కు స్టెప్పులేయడంతో.. ఫంక్షన్ కేరింతలతో మారుమోగిపోయింది.


ఫుల్ జోష్‌తో ‘కింగ్’ నాగార్జున ‘కన్నె పిట్టరో.. కన్నుకొట్టరో..’ సాంగ్‌కు చిందేశారు. ఇక కాబోయే దంపతులు కార్తికేయ, పూజ కలిసి ‘నాపేరు మురుగన్‌..’ సాంగ్‌కు డ్యాన్స్‌ చేయడంతో.. అందరూ హుషారుతో ఉర్రూతలూగిపోయారు.

ఇక ఈ పార్టీలో ఎన్టీఆర్ జై బాలయ్య అంటూ అందరిలో జోష్‌ని నింపారు. జయపురలో శుక్రవారం నుంచి జరుగుతోన్న కార్తికేయ, పూజ పెళ్లి వెడుకలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి.