భారత్‌కు ఇదే తొలిసారి..ఆ ముగ్గురూ పోరాడినా కూడా..

india-two-wickets-away-third-test-win-over-australia

మెల్‌బోర్న్ టెస్టులో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. బౌలర్లు మరోసారి చెలరేగిన వేళ ఆసీస్‌ను చిత్తుగా ఓడించింది. 399 పరుగుల భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 137 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. .షాన్ మార్ష్ , హెడ్ , ఖవాజా కాసేపు పోరాడినా ఫలితం లేకపోయిందిఆ ముగ్గురు కనుక పోరాడకపోతే ఇంకా తక్కువ స్కోరుకే అల్ అవుట్ అయేది . నాలుగోరోజు కమ్మిన్స్ పోరాటంతో భారత్ విజయం కోసం ఐదోరోజు వరకూ వేచి చూడాల్సి వచ్చింది. కాగా తొలిసారి బాక్సింగ్ డే టెస్టులో భారత్ విజయం సాధించింది. ఇప్పటివరకూ ఏడుసార్లు బాక్సింగ్ డే టెస్టులు ఆడగా.. ఐదు ఆసీస్ గెలిస్తే… రెండు డ్రాగా ముగిసాయి. అలాగే ఆసీస్ గడ్డపై రెండు టెస్టులు గెలవడం భారత్‌కు ఇదే తొలిసారి. సిడ్నీలో జరిగే చివరి టెస్టును కనీసం డ్రాగా చేసుకున్నా… ఎప్పటినుంచో ఊరిస్తోన్న సిరీస్ విజయం భారత్‌కు అందుతుంది.

మెల్‌బోర్న్ విజయంలో పుజారా , బూమ్రాలదే కీ రోల్‌గా చెప్పొచ్చు. బౌలింగ్‌కు అనుకూలిస్తోన్న పిచ్‌పై భారత బ్యాట్స్‌మెన్‌ పుజారా అద్భుతమైన ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. పట్టుదలగా ఆడి శతకంతో జట్టు భారీస్కోర్ సాధించడంలో కీలకమయ్యాడు. అలాగే కెప్టెన్ కోహ్లీ , యువ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అరంగేట్రంలోనే 76 పరుగులతో ఆకట్టుకున్నాడు. అటు బౌలింగ్‌లో మాత్రం బూమ్రా అదరగొట్టాడు. కెరీర్ బెస్ట్ పెర్ఫార్మెన్స్‌తో ఆసీస్ పతనాన్ని శాసించాడు. 33 పరుగులకు 6 వికెట్లు పడగొట్టాడు. దీంతో ఆసీస్ 151 పరుగులకే కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ కీలకమైన ఫించ్, మార్ష్ వికెట్లు పడగొట్టి విజయాన్ని అందించాడు.

తాజా విజయంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో భారత్ 2-1 ఆధిక్యంలో నిలిచింది. సిడ్నీ వేదికగా జరగనున్న చివరి మ్యాచ్‌ను డ్రా చేసుకున్నా… సిరీస్ కైవసం చేసుకుంటుంది. అదే జరిగితే ఇప్పటి వరకూ కంగారూ గడ్డపై అందని ద్రాక్షగా ఊరిస్తోన్న సిరీస్ విజయం దక్కినట్టే. దీంతో ఆసీస్‌లో తొలిసారి జట్టుకు సిరీస్ విజయం అందించిన భారత కెప్టెన్‌గా కోహ్లీ అరుదైన రికార్డ్ అందుకోనున్నాడు.