కన్నుల పండువగా జరిగిన కొమురవెల్లి మల్లికార్జున స్వామి కల్యాణం

సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి కల్యాణం కన్నుల పండుగగా జరిగింది. గొల్ల కేతమ్మ, బలిజ మేడలమ్మ దేవీల సహిత మల్లన్న కల్యాణం వేదపండితుల మంత్రోచ్చరణ మధ్య వైభవంగా జరిగింది. స్వామి కల్యాణానికి.. ప్రభుత్వం విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఇక భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌, జనగామ ఎమ్మల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ ఈ కార్యక్రమంలో‌ పాల్గొన్నారు.

ఇక స్వామివారి కల్యాణోత్సవం సందర్బంగా..ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నారు. మల్లన్న కల్యాణం తర్వాత సంక్రాంతి నుంచి ఉగాది వరకు.. ఇక్కడ జానపదుల జాతర జరుగుతోంది. దాదాపు 3 నెలల పాటు జరిగే ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు హాజరవుతున్నారు. తెలంగాణ సంస్కృతిని అద్దంపట్టే ఈ వేడుకను చూసేందుకు రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు భక్తులు.