పెళ్లిపీటలు ఎక్కబోతున్న విశాల్.. హైదరాబాద్ అమ్మాయే..

vishal-to-get-married-to-a-hyderabad-girl-dad-gk-reddy-spills-the-beans

సినీ హీరో, దక్షిణ భారత నటీనటుల(నడిగర్) సంఘం అధ్యక్షులు విశాల్ వివాహం హైదరాబాద్ కు చెందిన అనీషాతో జరగనుంది. ఈ మేరకు విశాల్ పెళ్లి విషయమై ఆయన తండ్రి జీ వి. కృష్ణారెడ్డి తమిళ్ డైలీతో మాట్లాడారు. ఇరుకుటుంబాల మధ్య చూపులు ముగిశాయి. విశాల్, అనీషా ఎంగేజ్ మెంట్ త్వరలోనే జరగనుందని అన్నారుి. ఈ వేడుక హైదరాబాద్ లో జరిపేందుకు రెండు కుటుంబాలు ప్లాన్ చేస్తున్నాయి. అయితే పెళ్లిమాత్రం చెన్నైలోని నడిగర్ సంఘం భవనంలో జరగనుందని సమాచారం. 2019 మార్చిలో నడిగర్ సంఘం భవనం ప్రారంభం కానుంది. ఈ భవనంలోనే తాను వివాహం చేసుకుంటానని గతంలో విశాల్ వెల్లడించిన సంగతి తెలిసిందే.

Also read : దుబాయ్‌ క్రికెట్‌ స్టేడియంలో రాహుల్‌గాంధీ

కాగా విశాల్, అనీషా నిశ్చితార్ద వేడుక హైద‌రాబాద్‌లోని ప్ర‌ముఖ హోట‌ల్‌లో జ‌రుగుతుంద‌ని సమాచారం. ఈ కార్య‌క్ర‌మానికి దక్షిణ భారత సినీ సెల‌బ్రిటీలు హాజ‌రు కానున్న‌ట్టు తెలుస్తోంది. ఇదిలావుంటే విశాల్, నటి వరలక్ష్మి ఇద్దరు ప్రేమలో ఉన్నట్టు కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ రూమర్లను విశాల్, వరలక్ష్మిలు పలుమార్లు ఖండిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో విశాల్.. అనీషాను పెళ్లిచేసుకుంటుండటంతో ఈ రూమర్లకు పులుస్టాప్ పడినట్లయింది. కాగా ప్ర‌స్తుతం త‌మిళంలో టెంప‌ర్ రీమేక్ చేస్తున్నాడు విశాల్. వెంకట్‌మోహన్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో విశాల్ పోలీస్ ఆఫీస‌ర్‌ పాత్రలో క‌నిపించ‌నున్నాడు.ఆయ‌న స‌ర‌స‌న రాశీ ఖ‌న్నా క‌థానాయిక‌గా నటిస్తోంది.