రేపటినుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు

whatsapp-will-no-longer-work-these-phones-by-january-1

రేపటి (జనవరి 1)నుంచి కొన్నిఫోన్లలో వాట్సాప్ సేవలను నిలిపివేస్తున్నట్టు వాట్సప్‌ ప్రకటించింది. ఇందులో ‘నోకియా ఎస్‌ 40’, ఆండ్రాయిడ్‌ ఓఎస్‌ వెర్షన్‌ 2.3.7తో పాటు దాని పాత ఓఎస్‌లో కూడా వాట్సప్‌ పనిచేయదు. ఇప్పటికే న్యూ వెర్షన్ తో వాట్సాప్ పనిచేస్తోంది. రేపటినుంచి కొన్ని ఓల్డ్ ఓఎస్‌ ఫోన్లలో వాట్సాప్ సపోర్ట్‌ చేయబోదని వాట్సప్‌ తన బ్లాగ్‌లో రాసుకొచ్చింది. ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ 2.3.3 కంటే పాత ఓఎస్‌లో వాట్సప్‌ పనిచేయదు. విండోస్‌ ఫోన్‌ 7, ఐఫోన్‌ 3జీఎస్‌/ఐఓఎస్‌ 6, నోకియా సింబియన్‌ ఎస్‌ 60 వెర్షన్లలో కూడా వాట్సప్‌ పనిచేయదు. వాట్సాప్ సేవలు కొనసాగాలంటే ఓఎస్‌ 4.0 ప్లస్‌, ఐఓఎస్‌ 7 ప్లస్‌ లేదా విండోస్‌ ఫోన్‌ 8.1 ప్లస్‌కు అప్‌డేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది.

Also read : పెళ్లిపీటలు ఎక్కబోతున్న విశాల్.. హైదరాబాద్ అమ్మాయే..

లేనిచొ డిసెంబర్‌ 31 తర్వాత వారికి వాట్సప్‌ పనిచేయదని తెలిపింది. ఐఓఎస్‌ 6, వెర్షన్లల్లోనూ 2020, ఫిబ్రవరి 1 నుంచి వాట్సప్‌ సేవలు నిలిచిపోనున్నాయి. ఐఫోన్‌ 4, ఐఫోన్‌ 4ఎస్‌, ఐఫోన్‌ 5, ఐఫోన్‌ 5సీ, ఐఫోన్‌ 5ఎస్‌.. ఐఓఎస్‌ 7 ఆధారంగా నడుస్తున్నాయి. ఆండ్రాయిడ్‌ రన్నింగ్‌ ఓఎస్‌ 4.0 ప్లస్‌, ఐఫోన్‌ రన్నింగ్‌ ఐఓఎస్‌ 8 ప్లస్‌, విండోస్‌ ఫోన్‌ 8.1 ప్లస్‌, జియో ఫోన్‌, జియో ఫోన్‌ 2లకు వాట్సప్‌ సేవలు యధావిధిగా పనిచేస్తాయి. కానీ ఈ ఫోన్లలో చాట్‌ హిస్టరీని ట్రాన్స్‌ఫర్‌ చేసుకునే సౌలభ్యం ఉండదు. అయితే చాట్‌ హిస్టరీని యూజర్ల మెయిల్‌కు మాత్రం పంపుకోవచ్చని వాట్సాప్ తెలిపింది.