టీ20 వరల్డ్‌కప్‌: శ్రీలంక, బంగ్లా జట్లకు నో డైరెక్ట్ ఎంట్రీ

sri-lanka-bangladesh-miss-out-direct-entry-for-t20-world-cup-super-12s-t20-world-cup-cricket-2020

వచ్చే ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు నేరుగా అర్హత సాధించిన జట్ల వివరాలను అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) మంగళవారం ప్రకటించింది. టీ20 ర్యాంకింగ్స్‌ ప్రకారం టాప్-10లోని ఇండియా, పాకిస్థాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, విండీస్, ఆఫ్ఘనిస్థాన్ జట్లు సూపర్-12 స్టేజ్‌కు నేరుగా అర్హత సాధించగా. టాప్-10లో ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్ మాత్రం అర్హత సాధించలేకపోయాయి. ఈ రెండు జట్లు మెగా టోర్నీకి నేరుగా అర్హత సాధించడంలో విఫలమయ్యాయి.

Also read : గాల్లో గద్ద.. నక్క మధ్యలో కుందేలు.. చివరకు ఏమైందంటే..

దాంతో శ్రీలంక, బంగ్లాదేశ్‌లు గ్రూప్ స్టేజ్‌లో మరో ఆరు జట్లతో తలపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది జరిగే క్వాలిఫై రౌండ్‌లో శ్రీలంక, బంగ్లాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. ఇక సూపర్ 12 స్టేజ్‌కు శ్రీలంక అర్హత సాధించకపోవడంపై ఆ టీమ్ కెప్టెన్ లసిత్ మలింగ అసంతృప్తి వ్యక్తం చేశాడు. అలాగే బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్ షకీబ్ అల్ హసన్ స్పందిస్తూ.. మేము సూపర్ 12 బెర్త్ ను సాధించలేకపోయాం.. కానీ టోర్నమెంట్లో బాగా రాణిస్తాం అన్నారు.