పచ్చి ఉల్లిపాయ రోజూ తింటే..

ఉల్లిపాయ లేనిదే వంట పూర్తవదు. వండి తినడం కంటే పచ్చివి ఇంకా మంచివంటున్నారు పోషకాహార నిపుణులు. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదన్న నానుడిని అక్షరాలా నిజం చేస్తూ దీని ద్వారా చేకూరే మరికొన్ని ప్రయోజనాలు తెలుసుకుందాం..

  • రోజూ ఓ ఉల్లిపాయను ఆహారంలో భాగం చేసుకుంటే బాడీలోని కొవ్వు మొత్తం కరిగిపోతుంది. కొలెస్ట్రాల్ సమస్య ఉండదు. చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది.
  • బ్లడ్‌లోని షుగర్ లెవల్స్‌ని తగ్గిస్తుంది.
  • శ్వాస కోశ సమస్యలతో బాధ పడేవారికి పచ్చి ఉల్లిపాయ ఉపశమనాన్ని ఇస్తుంది. ఉల్లిపాయలో ఉండే ప్రత్యేక గుణాలే అందుకు దోహదం చేస్తాయి.
  • ఉల్లిపాయలో విటమిన్ సి, బి1 తో పాటు కే విటమిన్ కూడా ఉంది.
  • చర్మానికి కూడా ఉల్లిపాయ ఎంతో మేలు చేస్తుంది. ఉల్లిపాయను కోసి దాంతో ఒంటిపై రుద్దుకుంటే చర్మానికి నిగారింపు వస్తుంది. అలాగే ఉల్లి రసాన్ని తరచుగా చర్మానికి రాసుకుంటే చర్మ సమస్యలు దూరమవుతాయి.