రామాయణ కాలంనాటి ‘జటాయువు పక్షి’ వైరల్..

jatayuvu bird viral in social media

జటాయువు పక్షి అంటే తెలియని వారుండరు. రామాయణంలో రావణాసురుడు సీతని ఎత్తుకుని వెళ్తున్నపుడు జటాయువు రావణాసురిడితో పోరాడి తన రెండు రెక్కలు పోగొట్టుకుంటుంది. చివరకు రాముడికి సీతాపహరణ విషయం చెప్పి ప్రాణాలు విడుస్తుంది. జటాయువు త్యాగానికి చలించిన శ్రీరాముడు స్వయంగా ఆయన చేతులమీదుగానే జటాయువుకి దహన సంస్కారాలు చేస్తాడు. ఇది రామాయణం నాటి జటాయువు చరిత్ర. కాలక్రమేణా జటాయువు పక్షి మనిషికి కనిపించకుండా పోయింది.

Also read : దేశ ఆర్ధికస్థితి పతనం అయింది : సీఎం చంద్రబాబు

అప్పుడప్పుడు కొన్ని భారీ పక్షులు ప్రత్యక్షమవుతున్నాయి. వీటిని జటాయువు పక్షి అని అనుకుంటున్నారు. తాజగా జటాయువు పక్షి రూపంలో ఉన్న ఓ భారీ పక్షి సామజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. ఇది ఖచ్చితంగా జటాయువు అని చాలామంది నమ్ముతున్నారు. దానికి కారణం ఆ పక్షి భారీ ఆకారమే.. అని అంటున్నారు. అయితే కొందరు పక్షి ప్రేమికులు మాత్రం అది జటాయువు పక్షి కాదు.. అవి ఎప్పుడో అంతరించి పోయి ఉండొచ్చన్న అభిప్రయాన్ని వ్యక్తం చేస్తున్నారు.