అమెరికాలో షట్ డౌన్ ముగింపు!

america-government-shutdown-is-over

అమెరికాలో కొనసాగుతున్న షట్ డౌన్ ను ముగింపు పలికేందుకు ప్రతినిధుల సభ ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోరినట్లుగా మెక్సికో సరిహద్దుగోడ నిర్మాణానికి నిధులను కెటాయించకుండానే బిల్లును కాంగ్రెస్ లో ఫాస్ చేసింది. అయితే ప్రతినిధుల సభలో డెమోక్రటిక్ పార్టీ సభ్యుల సంఖ్య అధికంగా ఉండటంతో… రిపబ్లికన్ పార్టీ సభ్యులు బిల్లును వ్యతిరేకించినప్పటికీ సభ ఆమోదం లభించింది.

Also read : భారత్‌తో వన్డే సిరీస్‌కు ఆసీస్ జట్టు ఇదే.. 

అయితే సెనేట్లో రిపబ్లికన్లదే పైచేయి కావడంతో … ఇక్కడ బిల్లుకు ఆమోదం లభించడం కష్టతరమే కానుంది. ఒకవేళ గోడ నిర్మాణానికి నిధులను కెటాయించకుండానే ఇరు సభల్లో బిల్లుకు ఆమోదం లభించినా ….అధ్యక్షుడు తన వీటో అధికారాలతో దాన్నిరద్దుచేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. మెక్సికో సరిహద్దులో గోడ నిర్మాణానికి నిధుల కెటాయింపును డెమోక్రటిక్ పార్టీ సభ్యులు వ్యతిరేకించడంతో ద్రవ్యవినిమయ బిల్లు నిలిచిపోయింది. దీంతో డిసెంబర్ 22వ తేదీనుంచి దేశంలో షట్ డౌన్ కొనసాగుతోంది.