ప్రాణాలకు తెగించి పాముతో పోరాడి చివరకు.. వీడియో వైరల్

ఏ జన్మలో బంధమో ఎక్కడినుంచో వచ్చిన తనని ప్రేమగా చూసుకుంటున్నారు. వారిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. అందుకోసం ప్రాణాలకు తెగించి పాముతో పోరాడి విశ్వాసానికి మారుపేరుగా నిలిచింది ఈ శునకం. అందరూ లోపల ఉన్నారు. వారు ప్రేమగా పెట్టిన బ్రెడ్, బిస్కెట్ తిని బయటకు వచ్చి కూర్చుంది. అటు ఇటు పరికిస్తోంది.

ఇంతలో ఎక్కడినుంచి వచ్చిందో ఓ పెద్ద నాగుపాము జర జర పాక్కుంటూ వచ్చేస్తుంది. ఎక్కడ ఇంట్లోకి వెళ్లిపోయి తమ యజమానిని, ఇంట్లోని వారిని ఏమైనా చేస్తుందేమోనని భావించింది శునకం. అంతే.. ఎక్కడలేని బలాన్ని, ధైర్యాన్ని తెచ్చుకుని వీరోచితంగా పోరాడింది.

ఎలా అయినా దాన్ని ఇంట్లోకి వెళ్లకుండా చేయాలనుకుంది. తమ వారికి ఏమీ కాకూడదన్న తలంపే తనని చివరి వరకు పోరాడేలా చేసింది. పాము కూడా నీ అరుపులకు భయపడేదాన్ని కాదన్నట్లు తన సహజత్వాన్ని ప్రదర్శిస్తూ బుసలు కొడుతోంది.

పడగ విప్పి శునకాన్ని భయపెడుతోంది. అయినా శునకం ఏ మాత్రం వెనక్కి తగ్గేది లేదంటూ పాము తల దగ్గర పట్టుకుని ఒకసారి, తోక దగ్గర పట్టుకుని మరోసారి దాన్ని శక్తిలేనిదానిగా చేసింది. మొత్తానికి దాన్ని చంపేసింది. దాదాపు పావుగంటకు పైగా ఈ రెంటి మధ్య జరిగిన పోరాటం.. శునకాలు యజమానులను ఎంతగా ప్రేమిస్తాయో అద్దం పడుతుంది.

తన ప్రాణాలను ఫణంగా పెట్టి పాముతో శునకం పోరాడిన తీరు ఇంటి వారిని ఆకట్టుకుంది. ఈ రెంటి మధ్య జరిగిన యుద్దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.