టీమిండియా భారీ స్కోర్.. కుదురుకుంటే తప్పా సిరీస్ విజయాన్ని..

india-declare-6227-sydney-test

సిడ్నీలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో టీమిండియా 622/7 భారీ స్కోర్ సాధించింది. దాంతో ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ చతేశ్వర్‌ పుజారా(193) జట్టు భారీ స్కోర్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.అతనికి రిషబ్ పంత్‌(159) తోడయ్యాడు. 303/4 ఓవర్‌ నైట్‌ స్కోరుతో రెండో రోజు శుక్రవారం ఆట ప్రారంభించిన భారత్‌ మరో 3 వికెట్లు కో​ల్పోయి 319 పరుగులు జోడించింది. రిషబ్ పంత్‌ సెంచరీ, రవీంద్ర జడేజా అర్ధ సెంచరీలు సాధించారు. చతేశ్వర్‌ పుజారా తృటిలో డబల్ సెంచరీ మిస్ అయింది. మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ హనుమ విహారి(42) ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. చివర్లో రిషబ్ పంత్‌, జడేజా జోడి చెలరేగడటంతో టీమిండియా స్కోరు 600 పరుగులు దాటింది.

Also read : జగన్‌పై దాడి కేసు.. డిసెంబర్ 31నే కేంద్రం..

వీరిద్దరూ ఏడో వికెట్‌కు 204 పరుగులు జోడించారు. జడేజా 114 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 81 పరుగులు చేశాడు. అయితే జడేజా కూడా తృటిలో సెంచరీని చేజార్చుకున్నాడు. జడేజాను లయన్‌ అవుట్‌ చేయడంతో టీమిండియా కెప్టెన్‌ కోహ్లి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేశాడు. ఇక మొదటి ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 10 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 24 పరుగులు చేసింది. ఇదిలావుంటే ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా కుదురుకుంటే తప్పా టీమిండియా సిరీస్ విజయాన్ని ఆపలేరు. ఎటు లేదన్నా 600 పైచిలుకు పరుగులు చేయడానికి ఆసీస్ కు రెండు రోజులు పడుతుంది. ఆల్రెడీ రెండు రోజులు పూర్తి అయింది కనుక ఆఖరి రోజు ఇరుజట్లకూ కీలకం అని అభిప్రాయపడుతున్నారు.