భారత్‌తో వన్డే సిరీస్‌కు ఆసీస్ జట్టు ఇదే..

india-vs-australia-peter-siddle-usman-khawaja-return-to-australia-odi-squad-for-india-series

టెస్టు సిరీస్ అనంతరం భారత్‌తో ఈనెల 12 నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా 14 మందితో కూడిన జట్టును ప్రకటించింది. మిచెల్ స్టార్క్, జోష్ హేజిల్‌వుడ్, పాటి కమిన్స్‌లకు విశ్రాంతి ఇచ్చింది. శ్రీలంకతో జరగనున్న టెస్టు సిరీస్‌ను దృష్టిలో ఉంచుకుని వీరికి విశ్రాంతి ఇచ్చింది. ఇక క్రిస్ లిన్, ట్రావిస్ హెడ్, బెన్ మెక్‌డెర్మాట్, డిఆర్కీ షార్ట్, అలాగే ఆల్‌రౌండర్ ఆష్టన్ అగర్‌లపై వేటేసిన క్రికెట్ ఆస్ట్రేలియా.. మీడియం పేసర్ పీటర్ సిడెల్‌, ఉస్మాన్ ఖావాజా, ఆఫ్ స్పిన్నర్ నాథన్ లియాన్ లకు చోటు కల్పించింది.

Also read : మ్యాగీ ఆరోగ్యానికి ప్రమాదమా? ఇందులో సీసం ఉన్నట్టుగా.. 

ఆస్ట్రేలియా జట్టు: అరోన్ ఫించ్ (కెప్టెన్), ఉస్మాన్ ఖావాజా, షాన్ మార్ష్, పీటర్ హ్యాండ్స్‌కోంబ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయిన్స్, మిచ్ మార్ష్, అలెక్స్ కేరీ, రిచర్డ్‌సన్, బిల్లీ స్టాన్‌లేక్, జాసన్ బెహ్రెండార్ఫ్, పీటర్ సిడెల్, నాథ్ లియాన్, ఆడం జంపా.