రెస్టారెంట్‌కి వెళ్లి స్ట్రా కావాలంటూ ఆమెని.. వీడియో వైరల్

రెస్టారెంట్‌కి వెళ్లి హ్యాపీగా నచ్చింది తినక అడిగింది ఇవ్వలేదని అక్కడ కూడా తన బలాన్ని ప్రదర్శించాలనుకున్నాడు ఓ వ్యక్తి. ప్లోరిడాలోని సెయింట్ పీటర్స్ బర్గ్‌లో ఉన్న మెక్‌డొనాల్డ్స్ రెస్టారెంట్‌కి వెళ్లాడు. తనకు నచ్చినవి ఆర్డర్ చేశాడు.

అతడు ఆర్డర్ చేసిన డ్రింక్స్‌తో పాటు సర్వర్ స్ట్రా తీసుకురాలేదు. అదే విషయాన్ని వెళ్లి కౌంటర్‌లో చెప్పాడు వచ్చిన వ్యక్తి. చెప్పేది మాములుగా కాకుండా సర్వర్‌కి బుద్దిలేదా. స్ట్రా ఇవ్వకుండా అలా ఎలా సర్వర్ చేస్తారని క్యాషియర్‌ని తిట్టి సగం కోపం చల్లారాక సీట్లో కూర్చున్నాడు. ప్లాస్టిక్ స్ట్రాలు ఇవ్వట్లేదు.. వాటిని బ్యాన్ చేశాము అని చెప్పారు. అయిన అతడు వినిపించుకోలేదు.

ఇంతలో అక్కడే మరొకరి ఫుడ్ సర్వ్ చేస్తున్న యువతిని చూసాడు. మళ్లీ కోపం మొదటికి వచ్చింది. ఆమెని కాలర్ పట్టుకుని లాగబోయాడు. అంతే.. వెంటనే అలర్ట్ అయిన ఆమె అతగాడి వీపు విమానం మోత మోగించింది. పిడిగుద్దుల వర్షం కురిపించి అతగాడిని బాక్సింగ్ ఆడేసింది.

మరొకరు వచ్చి విడిపించేంత వరకు ఆమె అతడిని వదిలిపెట్టలేదు. ఈ వ్యవహారమంతా అక్కడికి వచ్చిన మరో కస్టమర్ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. సమస్యని ఎలా ఎదుర్కోవాలో నిన్ను చూసి నేర్చుకోవాలంటూ లేడీ సర్వర్‌ని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు నెటిజెన్స్.