ట్రంప్ వ్యాఖ్యలపై తీవ్రదుమారం..భారత్‌ను టార్గెట్ చేసిన ట్రంప్

Donald-J-Trump-modi
Donald-J-Trump-modi

అఫ్గనిస్తాన్ రక్షణ విషయంలో భారతదేశం చోరవ చూపిస్తుందంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ శాఖ తీవ్రంగా స్పందించింది. ఈ దేశ రక్షణలో కానీ.. సైనిక విభాగంలో కానీ భారత్ జోక్యం చేసుకోవడం లేదని.. అక్కడ అభివృద్ధిలో పాలుపంచుకుంటుందని స్పష్టం చేసింది. ట్రంప్ తన అభిప్రాయం మార్చుకోవాలని సూచించింది. యుద్ధాల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఆఫ్గనిస్తాన్ లో పౌరుల ఆర్ధిక, సామాజిక అభివృద్ధికి భారత్ కట్టుబడి ఉందన్నారు. కేవలం మానవతా దృక్పథంతోనే 3 బిలియన్ డాలర్లకు పైగా సాయం చేసినట్టు విదేశాంగ శాఖ తెలిపింది. భారత్ ఆఫ్గన్ దేశంలో స్వతంత్రంగా ఎలాంటి సైనిక దళాలను పంపలేదని.. కేవలం ఐక్యరాజ్యసమితి ద్వారానే ఆర్మీ సిబ్బంది పనిచేస్తున్నారని గుర్తుచేసింది. అమెరికా తరహాలో తమకు ఎక్కడా ఆర్మీ బేస్ లు లేవన్నారు.