అప్పుడు మాటలతో ఇప్పుడు బ్యాట్‌తో..ధోనీతో కానిది రిషబ్‌తో అయింది

Rishabh Pant
Rishabh Pant

ఆస్ట్రేలియా పర్యటనలో తనదైన స్లెడ్జింగ్‌తో హాట్‌టాపిక్‌గా నిలిచిన టీమిండియా యువ వికెట్‌ కీపర్ రిషభ్‌ పంత్‌.. చివరి టెస్ట్‌లో తన విశ్వరూపాన్ని చూపించాడు. ఇప్పటి వరకు ఆతిథ్య జట్టు ఆటగాళ్లకు మాటకు మాట బదులిస్తూ వార్తల్లో నిలిచిన పంత్‌.. సిడ్నీ వేదికగా జరుగుతున్న నాలుగో టెస్ట్‌లో సెంచరీ బాది.. ఆసీస్‌ గడ్డపై ఈ ఘనతను అందుకున్న తొలి భారత వికెట్‌ కీపర్‌గా రికార్డు సృష్టించాడు. దీంతో పంత్‌కు ఫిదా అయిన ఫ్యాన్స్ అతనిపై ఓ అద్భుత పాటను రూపొందించి పాడారు. ప్రస్తుతం ఈ పాట నెట్టింట హల్‌చల్‌ చేస్తోంది. పంత్‌-పైన్‌ స్లెడ్జింగ్‌ ప్రతిబింబించేలా ఉన్న ఈ పాట నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.