గ్యాస్‌ ట్రబుల్‌తో ఇబ్బంది.. ఇంట్లోని వస్తువులతో ఈజీగా..

బావుందని ఎక్కువ తిన్నా గ్యాస్ ఫామ్ అవుతుంది. బాలేదని అసలు తినకుండా మానేసినా గ్యాస్ ఫామ్ అవుతుంది. ఖాళీ కడుపుతో ఉన్నా, కడుపు నిండుగా ఉన్నా ఇబ్బంది. అందుకే సరిపడా.. వీలైతే కొంచెం తక్కువే ఆహారం తీసుకోమంటారు పోషకాహార నిపుణులు.

ఫుల్లుగా లాగించి అరగక ఆపసోపాలు పడేకంటే కొంచెం వెలితిగా తింటే ఈ సమస్యలు ఉండవు. సమయానికి ఆహారం తీసుకోకపోయినా కూడా గ్యాస్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇంకా మలబద్దకం వలన కూడా గ్యాస్ ట్రబుల్ వస్తుంది. అయితే కొన్ని రకాల చిట్కాలు పాటిస్తే గ్యాస్ సమస్యనుంచి ఈజీగా బయటపడొచ్చంటున్నారు.

అల్లం రసంలో కొద్దిగా బెల్లం పొడిని కలిపి క్రమం తప్పకుండా తీసుకుంటే గ్యాస్ ట్రబుల్ తగ్గిపోతుంది.
ధనియాలు, సొంఠి కలిపి కషాయంగా చేసుకుని రోజూ తీసుకుంటే తగ్గిపోతుంది.
సోంపు, జీలకర్రను సమానంగా తీసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. దీన్ని రోజూ ఓ స్పూన్ తీసుకుని గ్లాసుడు గోరువెచ్చని నీటిలో కలిపి తాగుతుంటే గ్యాస్ సమస్య క్రమంగా తగ్గిపోతుంది.


ఇంగువ పొడిని తీసుకుని రోజూ భోజనం చేసే సమయంలో ఒక ముద్దలో కొద్దిగా కలిపి తీసుకున్నా గ్యాస్ ట్రబుల్ తగ్గుతుంది.


పెరట్లో కరివేపాకు చెట్టు వుంటే పరగడుపున గుప్పెడు కరివేపాకులు తీసుకుంటే కూడా గ్యాస్ బారినుంచి బయటపడవచ్చు.
వాము ద్వారా కూడా గ్యాస్ ట్రబుల్ సమస్యను అదుపులోకి తెచ్చుకోవచ్చు. రోజూ రాత్రి పడుకునే ముందు ఓ స్పూన్ వాము తీసుకుంటే గ్యాస్ ట్రబుల్ నించి ఉపశమనం లభిస్తుంది. అల్లం రసంలో కొద్దిగా బెల్లం పొడిని కలిపి క్రమం తప్పకుండా తీసుకుంటే గ్యాస్ ట్రబుల్ తగ్గిపోతుంది.