ప్రొ కబడ్డీ లీగ్‌లో తొడగొట్టిన బెంగళూరు బుల్స్..

Pro Kabaddi 2018 Final, Bengaluru Bulls vs Gujarat Fortune Giants, Pro Kabaddi final, Pro Kabaddi

ప్రొ కబడ్డీ లీగ్‌లో బెంగళూరు బుల్స్‌ తొడగొట్టింది. ఫైనల్లో ఫేవరెట్‌ గుజరాత్‌ను చిత్తుచేసి తొలిసారి లీగ్‌ చాంపియన్‌ ట్రోఫీ అందుకుంది. హోరా హోరీగా సాగిన ఫైనల్‌ ఫైట్‌లో బెంగళూరు 38-33తో గుజరాత్‌ ఫార్చ్యూన్‌ జెయింట్స్‌ను ఓడించింది. దీంతో వరుసగా రెండో ఏడాది కూడా గుజరాత్‌ రన్నర్‌పతోనే సరిపెట్టుకోక తప్పలేదు.

హైఓల్టేజ్‌ మ్యాచ్‌లో బుల్స్‌ను విజయ తీరాలకు చేర్చడంలో స్టార్‌ రైడర్‌ పవన్‌ ప్రధాన పాత్ర పోషించాడు. ఫస్ట్‌ హాప్‌లో గుజరాత్‌ రైడర్‌ సచిన్‌ రాణించడంతో ఆ జట్టు 17-9తో ఆధిక్యంలో నిలిచింది. కానీ సెకెండాఫ్‌లో రైడర్‌ పవన్‌ చెలరేగడంతో 10వ నిమిషానికి బుల్స్‌ 23-22 స్కోరుతో రేసులోకి దూసుకొచ్చింది. అక్కడ నుంచి ఆధిక్యం ఇరు జట్ల మధ్య చేతులు మారింది. 16వ నిమిషంలో 29-29తో స్కోర్లు సమమయ్యాయి. ఈ దశలో బుల్స్‌ రైడర్‌ పవన్‌ వరుస రైడ్లలో పాయింట్లు సాధించి జట్టును గెలిపించాడు.

Also Read : మరోసారి బ్యాంకు ఉద్యోగుల సమ్మె

ఈ లీగ్‌లో మోస్ట్‌ వాల్యుబుల్‌ ప్లేయర్‌ అవార్డును పవన్‌ కుమార్‌ దక్కించుకున్నాడు. రైడర్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌ అవార్డును ప్రదీప్‌ నర్వాల్‌ దక్కించుకోగా, డిఫెండర్‌ ఆఫ్‌ ద టోర్నమెంట్‌ అవార్డును నితీష్‌ కుమార్‌ సొంతం చేసుకున్నాడు.