కారు సైకిల్ ఢీ.. తుక్కుతుకైన కారు..

shocking video, cycle and car viral, car damaged after It Collided With A Cycle, Car damaged by bicycle after collision,

ముల్లు వచ్చి అరిటాకు మీద పడ్డా.. అరిటాకు ఉచ్చి ముల్లు మీద పడ్డా .. అరిటాకుకే ఇబ్బంది. అని మనకు తెలిసిన సామెత. కానీ ఇప్పుడు వెర్షన్ మారింది. కారు వెళ్లి సైకిల్‌ని గుద్దిన.. సైకిల్ వచ్చి కారును గుద్దినా తుక్కుతుక్కు అయ్యేది కారే.. మరి చిత్రం కాకపోతే సైకిల్ వెళ్లి కారును గుద్దితే అది పచ్చడవ్వడం ఏంటీ? దక్షిణ చైనాలో . షెంజన్‌ నగరంలో జరిగిన ఓ ప్రమాదంలో మాత్రం చిత్రమే జరిగింది.

వేగంగా వచ్చిన ఓ సైకిల్‌ కారును ఢీకొనడంతో.. కారు బంపర్‌ డ్యామేజ్ అయిపోయింది. సైకిల్ బంపర్ మధ్యలోకి ఇరుక్కుపోయింది. అయితే అంత ప్రమాదం జరిగినా సైకిల్‌కి మాత్రం ఏమీ కాలేదు. బంపర్ మధ్యలో ఇరక్కుపోయి అలా నిలబడిపోయింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ హల్‌చల్ చేస్తున్నారు. నెటిజన్లు ఈ ఘటనపై ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సైకిల్‌ను ఎవరు తయారు చేశార్రా బాబు అంటూ చలోక్తులు విసురుతున్నారు. కొందరు నెటిజన్లు ఇది ఫేక్ ఫోటో అని కామెంట్ చేస్తుంటే.. మరికొందరైతే సైకిల్‌ను కారు బంపర్‌లో పెట్టి అలా వెరైటీగా డిజైన్ చేశారంటూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Also Read : ప్రాణాలకు తెగించి పాముతో పోరాడి చివరకు.. వీడియో వైరల్

అయితే ఈ ఘటన నిజమే అంటున్నారు షెంజన్‌ పోలీసులు. రాంగ్‌రూట్‌లో వచ్చిన ఓ సైక్లిస్ట్‌ కారును ఢీకొట్టగా ఈ ప్రమాదం జరిగిందని క్లారిటీ ఇచ్చారు. సైక్లిస్ట్‌కు చిన్నపాటి గాయాలు కాగా కారులో ఉన్న వారు క్షేమంగా ఉన్నారని వారు పేర్కొన్నారు. దీంతో ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ.. అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.