భారత్ విజయం కష్టమేనా..?

india vs austrelia 4th test

ఆస్ట్రేలియా, భారత్ మధ్య జరుగుతోన్న ఆఖరి టెస్టులో భారత్ విజయానికి వరుణుడు అడ్డంకిగా మారాడు. నాల్గో రోజు వర్షం పదేపదే అంతరాయం కలిగించడం, వెలుతురులేమి కారణంగా ఆదివారం మ్యాచ్‌లో కేవలం 25 ఓవర్లు ఆట మాత్రమే సాగింది. నాలుగో రోజు ఆటలో టీమిండియా పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించినా ఆస్ట్రేలియాకు వరుణ దేవుడు అండగా నిలిచాడు. 300 స్కోర్ కే అల్ అవుట్ అయ్యి ఫాలో ఆన్ ఆడుతున్న ఆసీస్ మూడో సెషన్‌లో వెలుతురు తగ్గడంతో సెకండ్ ఇన్నింగ్స్‌లో 6/0 స్కోరుతో టీ బ్రేక్‌కు వెళ్లింది. ఆ తర్వాత మళ్లీ వర్షం రావడంతో అంపైర్లు ఆటను తాత్కాలికంగా నిలిపివేశారు.

Also read : జగన్‌ దొంగ పుత్రుడు.. మోడీతో కలిసి కుట్ర చేస్తున్నారు : మంత్రి లోకేష్ ఫైర్

అయితే వాతావరణంలో మబ్బులు కమ్ముకోవడం, వెలుతురు సరిగా లేమి కారణంగా అంపైర్లు నాల్గవ రోజు ఆటను ముగిస్తున్నట్లు ప్రకటించారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇంకా 316 పరుగులు వెనకంజలో ఉన్న ఆస్ట్రేలియా ఫాలో ఆన్ ఆడుతోంది. ఉస్మాన్ ఖవాజా(4), మార్కస్ హారీస్(2) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగులకు ఆలౌటైన ఆసీస్ రెండో ఇన్నింగ్స్ కొనసాగించింది. ఇదిలావుంటే ఆఖరిరోజు వరుణుడు సహకరించి ఆసీస్ అల్ అవుట్ అయితే తప్ప భారత్ విజయం కష్టమే.