రోజూ గుడ్డు తింటే గుండె..

రోజూ ఓ గుడ్డు తినే అలవాటు ఉన్న వారందరినీ చాలా గుడ్ అంటున్నారు డాక్టర్లు. ఉదయాన్నే టిఫిన్ తిన్నా తినకపోయినా ఎగ్ తినే అలవాటుని రోజు వారి జీవితంలో భాగం చేసుకోమంటున్నారు. గుడ్డులో ఉన్న ప్రొటీన్లు, విటమిన్లు అనేక అనారోగ్యాలనుంచి దూరం చేస్తుంది.

యూనివర్సిటీ ఆఫ్ ఈస్టర్న్ ఫిన్లాండ్‌కు చెందిన శాస్త్రవేత్తలు గుడ్డు తినని వారితో పోలిస్తే తినేవారు మధుమేహం బారిన పడే అవకాశాలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. చిన్నపిల్లలు మొదలు, పెద్దవారిని కూడా రోజూ ఓ గుడ్డు తినమని డాక్టర్లు చెబుతుంటారు.

ఎదిగే పిల్లలకు, పోషకాహార లేమితో బాధపడేవారు రోజూ ఓ గుడ్డు తినడం అవసరం. శరీరంలోని ప్రతి అవయవం మీద గుడ్డు ప్రభావం చూపుతుంది. గుడ్డు ద్వారా 70 నుంచి 80 శాతం క్యాలరీలను, 6 గ్రాముల ప్రొటీన్‌ని, 5 గ్రాముల కొవ్వుని గుడ్డు అందిస్తుంది.

మంచి కొలెస్ట్రాల్ 190 గ్రాములు గుడ్డులో ఉంటుంది. ఇంకా నీరు 87% ఉంటుంది. అరుదైన లవణాలు ఫాస్పరస్, అయోడిన్, సెలీనియం, ఐరన్, జింక్‌లు గుడ్డులో ఉన్నాయి. ఇలా శరీరానికి మేలు చేసే అనేక పోషకాలు దీనిలో ఉన్నాయి.

రోజూ గుడ్డు తినే వారికి కంటి శుక్లాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. డైటింగ్ చేసే వారు కూడా నిరభ్యంతరంగా గుడ్డు తినవచ్చు. ఇందులో ఉన్న ప్రొటీన్ కారణంగా గుడ్డు తినగానే కడుపు నిండిన భావన కలుగుతుంది. దాంతో ఎక్కువ ఆహారం తీసుకోలేరు. పరిమిత ఆహారం తీసుకోవడంతో బరువుని నియంత్రించుకోగలుగుతారు.

గుడ్డు గుండెకు కూడా ఎంతో మేలు చేస్తుంది. రోజూ గుడ్డు తింటే గుండె జబ్బులు పెరుగుతాయన్నది అపోహ మాత్రమే అని డాక్టర్ల అధ్యయనంలో వెల్లడైంది. వాస్తవానికి గుడ్డు తినేవారిలో రక్తనాళాలు మూసుకుపోయే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని చెబుతున్నారు.

గుడ్డు సొనలో 300 మైక్రోగ్రాముల కోలిన్ అనే పోషక పదార్థం ఉంది. ఇది మెదడు కణాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ఇందులో ఐరన్ ఉన్నందున గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు ఎంతో మేలు చేస్తుంది. రోజూ గుడ్డు తిన్న స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ బారిన పడే అవకాశం కూడా 44 శాతం తగ్గినట్లు తేలింది.
పురుషులలో టెస్టో స్టిరాన్ లెవల్స్‌ని గుడ్డు పెంచుతుంది. దీనిలో జింక్ పుష్కలంగా ఉన్నందున మేల్ హార్మోన్స్ పెరుగుతాయి.