ఎన్టీఆర్’కథానాయకుడు’కి క్లీన్ ‘యూ’ సిర్టిఫికెట్..

ntr kathanayakudu got clean 'u'cirtificate

ప్రఖ్యాత నటుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవిత చరిత్ర ఆధారంగా ఆయన బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా విడుదల అవుతున్న ఈ చిత్రం మొదటి పార్టు ఎన్టీఆర్’కథానాయకుడు’ జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 171 నిమిషాలు నిడివి గల ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ నుంచి క్లీన్ ‘యూ’ సిర్టిఫికెట్ వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల అవుతోంది. ఎన్టీఆర్ పాత్రలో ఆయన కుమారుడు నటసింహం బాలకృష్ణ నటించారు. బసవతారకంగ పాత్రలో విద్యాబాలన్ నటించింది. అలాగే నారా చంద్రబాబునాయుడు పాత్రలో రానా నటించారు.

Recommended For You